NZ vs SA: విజృంభిస్తున్న సౌతాఫ్రికా బౌలర్లు.. ఘోర ఓటమి దిశగా న్యూజిలాండ్

ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘోరంగా తడబడుతోంది. 

Updated : 01 Nov 2023 20:25 IST

పుణె: ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. ఓపెనర్ క్వింటన్ డికాక్ (114; 116 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), వాండర్‌ డసెన్ (133; 118 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) శతకాలు బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో కివీస్ ఘోర ఓటమి దిశగా సాగుతోంది. సౌతాఫ్రికా బౌలర్లు విజృంభిస్తుండటంతో 25 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. డేవాన్ కాన్వే (2), రచిన్‌ రవీంద్ర (9), టామ్ లేథమ్ (4), మిచెల్ శాంట్నర్ (7) తీవ్ర నిరాశపర్చారు. విల్ యంగ్ (33), డారిల్ మిచెల్ (24) పరుగులు చేశారు. ప్రస్తుతం గ్లెన్ ఫిలిప్స్ (12*), టిమ్ సౌథీ (7*) క్రీజులో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్ 2, కేశవ్ మహరాజ్‌ 2, కగిసో రబాడ, గెరాల్డ్ కోయెట్జీ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు