ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి సుమిత్‌ ఔట్‌

ఆస్ట్రేలియా ఓపెన్‌ 2021 నుంచి భారత టెన్నిస్‌ స్టార్‌ సుమిత్‌ నగల్‌ నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో తొలి రౌండ్‌లో లిథూనియా ఆటగాడు ఆర్‌ బెకరిస్‌ చేతిలో...

Updated : 17 Sep 2022 16:47 IST

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఓపెన్‌ 2021 నుంచి భారత టెన్నిస్‌ స్టార్‌ సుమిత్‌ నగల్‌ నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో తొలి రౌండ్‌లో లిథూనియా ఆటగాడు ఆర్‌ బెకరిస్‌ చేతిలో ఓటమిపాలయ్యాడు. దీంతో ఈ టోర్నీ నుంచి సుమిత్‌ వైదొలిగాడు. రెండు గంటలకు పైగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆది నుంచి ఆధిపత్యం చెలాయించిన బెకరిస్‌ చివరికి ఏ సెట్‌లోనూ సుమిత్‌కు అవకాశం ఇవ్వలేదు. భారత స్టార్‌ రెండో సెట్‌లో గట్టి పోటీ ఇచ్చినా చివరికి బెకరిస్‌ ముందు నిలవలేకపోయాడు. ఈ క్రమంలోనే 2-6, 5-7, 3-6 తేడాతో ఓటమిపాలయ్యాడు. 

ఇవీ చదవండి..
2018 తర్వాత ఇషాంత్‌ ఎలా ఆడుతున్నాడంటే... 
సుందర్‌ శతకం సాధించినట్లే: గావస్కర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని