ODI WC 2023: సూర్యకు వన్డేల్లో గొప్ప గణాంకాలు లేవు.. తుది జట్టులో తీవ్ర పోటీ: సన్నీ

వన్డే ప్రపంచకప్‌లో (ODI WC 2023) వార్మప్‌ మ్యాచ్‌ల సందడి ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. భారత్ తన తొలి వార్మప్ మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌తో శనివారం ఆడనుంది.

Updated : 29 Sep 2023 12:59 IST

ఇంటర్నెట్ డెస్క్: వరల్డ్‌ కప్‌ కోసం (ODI World Cup 2023) భారత్‌ తన తుది స్క్వాడ్‌ను ప్రకటించేసింది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌ ఆడనుంది. అయితే, ఇప్పుడు తుది జట్టులో ఎవరు ఉంటారు? అనే చర్చకు తెరలేసింది. మరీ ముఖ్యంగా సూర్యకుమార్‌కు ఫైనల్ XIలో అవకాశం వస్తుందా అనేది అందరిలోనూ తలెత్తే ప్రశ్న. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో రెండు హాఫ్‌ సెంచరీలు సాధించి ఫామ్‌లోనే ఉన్నాడు. అయితే  టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మాత్రం సూర్య విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘సూర్యకుమార్‌ అద్భుతమైన ఆటగాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ, వన్డేల్లో అతడు ఇప్పటి వరకు గొప్ప ప్రదర్శనేమీ చేయలేదు. చివరి 15 - 20 ఓవర్లప్పుడు బ్యాటింగ్‌ చేస్తాడు. తన టీ20 బ్యాటింగ్‌ స్టైల్‌ను చక్కగా వినియోగించుకుని పరుగులు చేసేవాడు. అయితే, హార్దిక్‌ పాండ్య, ఇషాన్‌ కిషన్, కేఎల్ రాహుల్‌ కూడా మిడిలార్డర్‌లో రాణిస్తున్నారు. శ్రేయస్‌ అయ్యర్ నాలుగో స్థానంలో ఆడతాడు. కాబట్టి, సూర్యకుమార్‌ సెకండ్‌డౌన్‌లో ఆడాలంటే వేచి ఉండాల్సిందే. ఒకవేళ అవకాశం వచ్చి భారీ సెంచరీ కొడితే మాత్రం సూర్య ప్లేస్‌ ఖరారు అవుతుంది’’ అని సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. 

శనివారం తన తొలి వార్మప్‌లో ఇంగ్లాండ్‌తో తలపడబోతున్న టీమ్‌ఇండియా గువాహటికి చేరుకుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ అనంతరం కెప్టెన్‌ రోహిత్‌, కోహ్లీ, కొత్తగా జట్టులోకి వచ్చిన అశ్విన్‌ సహా ఆటగాళ్లంతా గురువారం గువాహటిలో అడుగు పెట్టారు. అక్టోబర్ 3న నెదర్లాండ్స్‌తో టీమ్‌ఇండియా మరో వార్మప్‌ మ్యాచ్‌లో ఆడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు