Suryakumar: కివీస్‌పై సెంచరీతో వీరవిహారం చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తన టీ20 కెరీర్‌లో రెండో శతకం బాదాడు.

Updated : 20 Nov 2022 14:38 IST

మౌంట్ మాంగనుయ్‌: టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌, మిస్టర్ 360 ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ (111*: 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) తన టీ20 కెరీర్‌లో రెండో శతకం బాదాడు. న్యూజిలాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో వీర విహారం చేశాడు. కేవలం 49 బంతుల్లో శతకాన్ని నమోదు చేశాడు. తొలుత అర్ధశతకం చేయడానికి 32 బంతులను తీసుకొన్న సూర్య.. ఆ తర్వాత సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడాడు. మరో 17 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను దాటేశాడు. సూర్య ధాటైన ఇన్నింగ్స్‌తో టీమ్‌ఇండియా కివీస్ ముందు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని