Suryakumar Yadav: ‘సూర్యను ప్రతి మ్యాచ్‌లో ఆడించాలి.. అతని కంటే బెటర్ ప్లేయర్‌ ఏ జట్టులోనూ లేడు’

రానున్న వన్డే ప్రపంచకప్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ను ప్రతి మ్యాచ్‌లో ఆడించాలని టీమ్‌ఇండియా యాజమాన్యానికి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు.

Published : 26 Sep 2023 16:22 IST

ఇంటర్నెట్ డెస్క్: రానున్న వన్డే ప్రపంచకప్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav)ను ప్రతి మ్యాచ్‌లో ఆడించాలని టీమ్‌ఇండియా యాజమాన్యానికి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) సూచించాడు. తుది జట్టులో అతడి పేరే మొదటగా ఉండాలని పేర్కొన్నాడు. కొన్నాళ్ల నుంచి వన్డేల్లో ఆశించిన మేరకు రాణించలేకపోయిన సూర్యకుమార్.. వన్డే ప్రపంచకప్‌ ముంగిట ఫామ్‌లోకి వచ్చాడు. ఆసీస్‌తో జరిగిన మొదటి వన్డేలో సరిగ్గా 50 పరుగులు చేసిన అతడు.. రెండో వన్డేలో 37 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 72 పరుగులు చేశాడు.  

Asian Games: భారత్‌ జోరు.. ఈక్వస్ట్రియన్‌లో బంగారు పతకం

‘‘సూర్యకుమార్‌ యాదవ్ వన్డే ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్‌లో ఆడాలి. అయితే, ఎవరి స్థానంలో ఆడిస్తారో నాకు తెలియదు. తుది జట్టులో మొదటి పేరు మాత్రం సూర్యదే అయి ఉండాలి. ఆ తర్వాతే మిగతా ఆటగాళ్ల సెలెక్షన్ గురించి ఆలోచించాలి. అతడు మ్యాచ్‌ను గెలిపించే ఆటగాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌ స్వరూపాన్నే మర్చగలడు. అతడు మంచి ప్రదర్శన కనబరిస్తే ఆ మ్యాచ్‌ ఏకపక్షంగా మారిపోతుంది. సూర్యకంటే మెరుగైన స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయగల బ్యాటర్‌ మరొకరు లేరు. హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా మనకు ఫినిషర్లుగా ఉన్నారు. కానీ, సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలో ఆడాలని నేను భావిస్తున్నాను. అతను  ప్రపంచ కప్‌లో ప్రతి మ్యాచ్ ఆడాలి. సూర్య కంటే బెటర్ ప్లేయర్‌ ఏ జట్టులోనూ లేడు’’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం (సెప్టెంబరు 27న) మూడో వన్డే జరగనుంది. మొదటి రెండు వన్డేల్లో భారత్‌ విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు