T20 World Cup 2021: టీమ్‌ఇండియా నెట్‌ బౌలర్‌గా అవేశ్‌ఖాన్

ఐపీఎల్‌ ముగిసిన తర్వాత యూఏఈలోనే ఉండాలని, టీ20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టులో నెట్‌బౌలర్‌గా చేరాలని దిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌ని బీసీసీఐ కోరింది. ఇప్పటికే సన్‌రైజర్స్‌ ఫాస్ట్‌బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ని కూడా నెట్‌ బౌలర్‌గా ఉండాలని బీసీసీఐ  కోరిన సంగతి తెలిసిందే.

Published : 12 Oct 2021 22:11 IST

(Photo: Avesh Khan Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ ముగిసిన తర్వాత యూఏఈలోనే ఉండాలని, టీ20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టులో నెట్‌బౌలర్‌గా చేరాలని దిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌ని బీసీసీఐ కోరింది. ఇప్పటికే సన్‌రైజర్స్‌ ఫాస్ట్‌బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ని కూడా నెట్‌ బౌలర్‌గా ఉండాలని బీసీసీఐ  కోరిన సంగతి తెలిసిందే. అవేశ్‌ ఖాన్‌ని స్టాండ్‌ బై లిస్ట్‌ ప్లేయర్‌గా కూడా పరిగణించే అవకాశమున్నట్లు సమాచారం. 

మధ్యప్రదేశ్‌కు చెందిన అవేశ్‌ ఖాన్‌ 140 నుంచి 145 కి.మీ. వేగంతో వైవిధ్యమైన బంతులను విసరడంలో దిట్ట. దిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌కు వెన్నుముకలా మారిన అవేశ్‌ఖాన్‌.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 23 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌ 2021 తొలి అంచె పోటీల్లో  మెరిసిన అవేశ్‌ఖాన్‌.. ఇంగ్లాండ్‌ పర్యటనకు నెట్‌బౌలర్‌గా ఎంపికయ్యాడు. టెస్టు సిరీస్‌ ఆరంభానికి ముందు కౌంటీ సెలెక్ట్‌ లెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌ చేస్తుండగా గాయపడ్డాడు. దీంతో పర్యటన నుంచి వైదొలగాల్సి వచ్చింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని