IND vs SA : తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆలౌట్‌

కీలకమైన కేప్‌టౌన్‌ టెస్టులో తొలి రోజే టీమ్ఇండియా ఆలౌటైంది. దక్షిణాఫ్రికాతో...

Published : 11 Jan 2022 20:50 IST

విరాట్ సూపర్‌ ఇన్నింగ్స్

తేలిపోయిన మిగతా బ్యాటర్లు

ఇంటర్నెట్ డెస్క్‌: కీలకమైన కేప్‌టౌన్‌ టెస్టులో తొలి రోజే టీమ్ఇండియా ఆలౌటైంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (79) అద్భుతంగా రాణించినా కీలకమైన సమయంలో పెవిలియన్‌కు చేరాడు. ఛెతేశ్వర్‌ పుజారా (43), రిషభ్‌ పంత్ (27) ఫర్వాలేదనిపించారు. కేఎల్‌ రాహుల్‌ 12, మయాంక్ అగర్వాల్‌ 15, అజింక్య రహానె 9, అశ్విన్‌ 2, శార్దూల్‌ ఠాకూర్‌ 12, ఉమేశ్‌ 4*, షమీ 7 పరుగులు చేశారు. సఫారీల బౌలర్లలో రబాడ 4, జాన్‌సెన్ 3.. ఒలివియర్‌, కేశవ్‌, ఎంగిడి మహరాజ్‌ చెరో వికెట్‌ తీశారు.

ఆ ముగ్గురు మినహా.. 

దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కోహ్లీ, పుజారా, పంత్ మినహా భారత బ్యాటర్లు క్రీజ్‌లో నిలబడలేకపోయారు. ఆఖరి వరకు ఎంతో ఓపికగా ఆడిన కోహ్లీ శతకం చేసేలా కనిపించాడు. అయితే ఓ పక్క వికెట్లు పడుతుండటంతో స్కోరు బోర్డు వేగం పెంచేందుకు ప్రయత్నించే క్రమంలో పెవిలియన్‌కు చేరాడు. పుజారా కూడా నిలదొక్కుకున్నా భారీ స్కోరు సాధించలేకపోయాడు. రిషభ్‌ పంత్‌ ఉన్నంతసేపు ఆత్మ విశ్వాసంతో కనిపించాడు. ఇక మిగతా బ్యాటర్లు ప్రభావం చూపలేకపోయారు. భారత బౌలర్లు విజృంభిస్తే గానీ మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం ఉండదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని