Shreyas Iyer: ఆ రికార్డు సాధించిన ఏడో క్రికెటర్‌ శ్రేయస్

టీమ్‌ఇండియా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికైన భారత ఏడో క్రికెటర్‌గా నిలిచాడు...

Published : 30 Nov 2021 13:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికైన భారత ఏడో క్రికెటర్‌గా నిలిచాడు. 2000 సంవత్సరం తర్వాత ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. కాన్పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రేయస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 105 పరుగులతో రాణించగా రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులతో ఆదుకున్నాడు. దీంతో భారత్‌ తరఫున తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో ఒక శతకం, ఒక అర్ధశతకం సాధించిన ఏకైక ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు.

మ్యాచ్‌ అనంతరం తన ప్రదర్శనపై స్పందించిన శ్రేయస్‌.. ఇలా రాణించడం గొప్పగా ఉన్నా మ్యాచ్‌ గెలిచి ఉంటే మరింత బాగుండేదన్నాడు. ఈ మ్యాచ్‌లో తాను వీలైనన్ని ఎక్కువ బంతులు ఆడాలనుకున్నట్లు చెప్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో క్లిష్ట పరిస్థితుల్లోంచి మ్యాచ్‌ గెలిచేంత పని చేయడం గర్వంగా ఉందన్నాడు. ఇక కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాట్లాడుతూ శ్రేయస్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. తొలి టెస్టులోనే యువ క్రికెటర్‌ ఇలా రాణించడం గొప్ప విశేషమని, అది జట్టు బలాన్ని తెలుపుతుందని అన్నాడు. ఈ మ్యాచ్‌లో అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకున్నాడన్నాడు. అయితే, శ్రేయస్‌ మరింత బాగా రాణించాలని, అందుకు ఇంకా కష్టపడాలని ద్రవిడ్‌ సూచించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని