US Open: ఎమ్మా రదుకాను ఆట చూడతరమా
ఇంటర్నెట్‌డెస్క్: యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో క్వాలిఫయర్‌గా అడుగు పెట్టి విజేతగా నిలిచి సంచలనం సృష్టించింది ఎమ్మా రదుకాను. ఫైనల్లో కెనాడా క్రీడాకారిణి లెలా ఫెర్నాండెజ్‌ను 6-4, 6-3 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. 1999 తర్వాత ఇద్దరు టీనేజర్ల మధ్య సాగిన ఈ తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ పోరు ఆద్యాంతం హోరాహోరీగా జరిగింది. ఫైనల్ చేరే క్రమంలో రదుకాను.. ఒలింపిక్ ఛాంపియన్ బెన్సిచ్, సకారి లాంటి క్రీడాకారిణులను చిత్తుచేసింది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ ఒసాకా, కెర్బర్, స్వితోలినా, సబలెంకా వంటి అగ్రశ్రేణి క్రీడాకారిణులను మట్టికరిపించింది. ఈ క్రమంలోనే ఫైనల్లో 73వ ర్యాంకులో ఉన్న ఫెర్నాండెజ్‌ను ఓడించింది. దీంతో 17 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌లో విజేతగా నిలిచిన అతి పిన్న వయస్కురాలిగా ఘనత సాధించింది. ఎమ్మా గురించి మరికొన్ని ఆసక్తికర విశేషాలు..
ఎమ్మా తన రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నిలోనే టైటిల్ నెగ్గింది. అతి తక్కువ గ్రాండ్‌స్లామ్‌ల అనుభవంతో విజేతగా నిలిచిన క్రీడాకారిణిగా రికార్డు సొంతం చేసుకుంది. ఈ ఏడాది వింబుల్డన్‌లో ఆమె నాలుగో రౌండ్ వరకూ వెళ్లగలిగింది. తనకు ఇదే తొలి యుఎస్ ఓపెన్.
150వ ర్యాంకర్‌గా ఈ టోర్నీలో అడుగు పెట్టిన ఎమ్మా హేమాహేమీలను ఓడించింది. ఈ క్రమంలోనే 2014లో సెరెనా విలియమ్స్ తర్వాత ఒక్క సెట్ కూడా కోల్పోకుండా యుఎస్ ఓపెన్ గెలిచిన తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది.
2004లో 17 ఏళ్ల వయసులో మారియా షరపోవా వింబుల్డన్ టైటిల్ సాధించిన తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌లో విజేతగా నిలిచిన అతి పిన్న వయస్కురాలిగా ఈ బ్రిటిష్ చిన్నది చరిత్ర సృష్టించింది.
ఈ విజయంతో ఎమ్మా.. ట్రోఫీతో పాటు దాదాపు రూ.18.38 కోట్లు (2.5 మిలియన్ల అమెరికా డాలర్లు) నగదు బహుమతి కూడా సొంతం చేసుకుంది. రన్నరప్ ఫెర్నాండెజ్ సుమారు రూ.9.19 కోట్లను అందుకుంది.
1977 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ గెలిచిన తొలి బ్రిటీష్ అమ్మాయిగా ఎమ్మా రికార్డు సృష్టించింది. 44 ఏళ్ల క్రితం ఆ దేశానికి చెందిన వర్జీనియా వేడ్ వింబుల్డన్‌లో విజేతగా నిలిచింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Viral-videos News
Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
-
Politics News
Bihar politics: నీతీశ్‌ను ఉపరాష్ట్రపతి చేయాలని అడిగారు: భాజపా ఆరోపణ
-
General News
Pancreatitis: కడుపులో నొప్పిగా ఉంటుందా..? ఇది ఎలా వస్తుందో తెలుసా..
-
Movies News
Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి
-
Politics News
Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
-
Politics News
jagadishreddy: మునుగోడులో తెరాస నేతలందరూ ఐక్యంగానే ఉన్నారు: జగదీశ్‌రెడ్డి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naga Chaitanya: అది నా పెళ్లి తేదీ.. దయచేసి ఎవరూ ఫాలో కాకండి: నాగచైతన్య
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Langya virus: చైనాలో జంతువుల నుంచి మరో కొత్తవైరస్ వ్యాప్తి
- Poorna: పెళ్లి క్యాన్సిల్ వార్తలపై పూర్ణ ఏమన్నారంటే..!
- Raghurama: వాళ్లిద్దరూ ఇష్టపడితే మనకేం ఇబ్బంది?: రఘురామ
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Vijay Deverakonda: ప్రమోషన్స్‌కి చెప్పులేసుకెళ్లడానికి కారణమదే: విజయ్ దేవరకొండ
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Gorantla madhav: మాధవ్ వీడియో ఒరిజినల్ కాదు.. అసలు వీడియో దొరికితేనే క్లారిటీ: అనంతపురం ఎస్పీ