Tokyo Olympics: నాన్నా.. నువ్వే నా హీరో.. ఈ పతకం నీకే అంకితం

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన పురుషుల హాకీ జట్టు కోట్లాది భారతీయుల మోముల్లో ఆనందాన్ని నింపింది. విశ్వక్రీడల్లో హాకీ జట్టుకు 41 ఏళ్ల తర్వాత పతకం దక్కడంతో దేశవ్యాప్తంగా సంబురాలు జరిగాయి....

Published : 07 Aug 2021 01:35 IST

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన పురుషుల హాకీ జట్టు కోట్లాది భారతీయుల మోముల్లో ఆనందాన్ని నింపింది. విశ్వక్రీడల్లో హాకీ జట్టుకు 41 ఏళ్ల తర్వాత పతకం దక్కడంతో దేశవ్యాప్తంగా సంబురాలు జరిగాయి. పతకం సాధించిన నేపథ్యంలో భారత ఆటగాళ్లు సైతం భావోద్వేగానికి గురయ్యారు. ఈ విజయంలో జట్టు గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేష్‌ కీలక పాత్ర పోషించి హీరోలా నిలిచాడు. గోల్‌ పోస్టుకు అడ్డుగోడలా నిలిచాడు. జర్మనీపై గెలిచిన అనంతరం అతడు భావోద్యేగంగా స్పందించాడు. హాకీ జట్టు గెలిచిన అనంతరం తన తండ్రి సంబురాలు చేసుకుంటున్న ఓ వీడియోను పంచుకొని.. తాను గెలిచిన ఈ కాంస్యం తన తండ్రికి అంకితమిస్తున్నట్లు పేర్కొన్నాడు. ‘ఈ పతకం నీకే అచ్చా (నాన్న). నువ్వే నా హీరో. నీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా’ అంటూ ట్వీట్‌ చేశాడు.

దీంతోపాటు మరో ట్వీట్‌ కూడా చేశాడు. పతకాన్ని అందుకున్న సమయంలో ఫొటోకు ఫోజ్‌ ఇస్తూ   తన 21 ఏళ్ల కల నెరవేరినట్లు తెలిపే పోస్టు చేశాడు. ఈ రెండు ట్వీట్లు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ ట్వీట్‌కు ఇప్పటివరకు 96 వేల లైకులు రాగా.. నాన్నకు అంకితమిస్తున్నట్లు తెలిపే పోస్టుకు 80 వేల లైకులకు పైగా వచ్చాయి.

జర్మనీతో జరిగిన కాంస్య పోరులో భారత హాకీ జట్టు చిరస్మరణీయ విజయం అందుకుంది. బలమైన ప్రత్యర్థిని 5-4 తేడాతో ఓడించింది. టీమ్‌ఇండియా నుంచి సిమ్రన్‌ జీత్‌ సింగ్‌ (17, 34 ని), హార్దిక్‌ సింగ్‌ (27ని), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (29ని), రూపిందర్‌ పాల్‌ సింగ్‌ (31ని) గోల్స్‌ చేశారు. జర్మనీలో టిముర్‌ ఒరుజ్‌ (2ని), నిక్లాస్‌ వెలెన్‌ (24ని), బెనెడిక్ట్‌ ఫర్క్‌ (25ని), లుకాస్‌ విండ్‌ఫెదెర్‌ (48ని) రాణించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని