Kohli: బంగ్లాదేశ్‌పై సెంచరీ.. సచిన్‌ రికార్డుకు మరింత చేరువైన కోహ్లీ..

ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ (Virat Kohli).. వన్డేల్లో సచిన్ తెందూల్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డుకు మరింత చేరువయ్యాడు. 

Published : 20 Oct 2023 01:56 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా (Team India) ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. విరాట్ కోహ్లీ (Virat Kohli) (103*; 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకం బాదాడు. లక్ష్యఛేదనలో 41.3 ఓవర్‌కు కోహ్లీ సిక్స్‌ బాది సెంచరీ పూర్తి చేసి భారత్‌కు విజయాన్ని అందించాడు. కోహ్లీకి వన్డేల్లో ఇది 48వ సెంచరీ కాగా.. ప్రపంచకప్‌లో మూడోది. వరల్డ్ కప్‌ లక్ష్య ఛేదనలో అతడికిది మొదటి శతకం. ఈ క్రమంలోనే వన్డేల్లో సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar) పేరిట ఉన్న అత్యధిక శతకాల రికార్డుకు మరింత చేరువగా కోహ్లీ వచ్చాడు. సచిన్‌ 463 వన్డేల్లో 49 శతకాలు చేయగా.. కోహ్లీ 285 మ్యాచ్‌ల్లోనే 48 శతకాలు పూర్తి చేసుకోవడం విశేషం. మరో రెండు సెంచరీలు చేస్తే సచిన్‌ రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు.

జయవర్ధనెను అధిగమించిన కోహ్లీ

ఈ ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక మాజీ క్రికెటర్ మహేల జయవర్ధనెను అధిగమించి కోహ్లీ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. సచిన్ తెందూల్కర్ (34,357 పరుగులు), కుమార సంగక్కర (28,016 పరుగులు), రికీ పాంటింగ్ (27,483 పరుగులు) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. కోహ్లీ (26,026 పరుగులు) నాలుగో స్థానంలో, జయవర్ధనె (25,957 పరుగులు) ఐదో స్థానంలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని