కరోనా బారిన వాషింగ్టన్‌ సుందర్‌.. సఫారీలతో వన్డే సిరీస్‌కు అనుమానమే?

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్‌ సుందర్‌ కరోనా బారిన పడ్డాడు. దీంతో దక్షిణాఫ్రికాతో...

Published : 11 Jan 2022 20:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్‌ సుందర్‌ కరోనా బారిన పడ్డాడు. దీంతో దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉంటున్న సుందర్ స్వల్ప లక్షణాలతో బాధపడుతూ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో క్వారంటైన్‌కు వెళ్లిపోయాడు. ఈ నెల 19 నుంచి దక్షిణాఫ్రికాతో భారత్‌ మూడు వన్డేలు ఆడనుంది. మరో రెండు రోజుల్లో వన్డే జట్టులోని ఆటగాళ్లతో కలిసి ప్రత్యేక విమానంలో సుందర్‌ సౌతాఫ్రికా వెళ్లాల్సి ఉంది. అయితే కరోనా బారిన పడటంతో వారితో వెళ్లేందుకు వీలులేదు. కరోనా తగ్గిన తర్వాత బీసీసీఐ అనుమతిస్తే మాత్రమే దక్షిణాఫ్రికాకు వెళ్లగలడు. 

గతేడాది ఇంగ్లాండ్‌ పర్యటనలో గాయపడిన సుందర్‌ కోలుకుని దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటాడు. విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే కరోనా సోకడంతో మళ్లీ జట్టులో స్థానం దక్కుతుందో లేదో చూడాలి. దక్షిణాఫ్రికాతో భారత్‌ జనవరి 19, జనవరి 21 (పారి), జనవరి 23 (కేప్‌టౌన్‌) తేదీల్లో వన్డే మ్యాచ్‌లు ఆడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని