Team India: పుజారాను డకౌట్‌ చేసిన షమి.. తర్వాత ఏం చేశాడో చూడండి..!

టీమ్‌ఇండియా ప్రధాన పేసర్‌ మహ్మద్‌ షమి.. టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారాను డకౌట్‌ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది...

Updated : 25 Jun 2022 09:31 IST

లీసెస్టర్‌: టీమ్‌ఇండియా ప్రధాన పేసర్‌ మహ్మద్‌ షమి.. టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారాను డకౌట్‌ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న టీమ్‌ఇండియా ప్రధాన జట్టు అసలు టెస్టుకు ముందు లీసెస్టర్‌ జట్టుతో వార్మప్‌ మ్యాచ్‌ ఆడుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లీసెస్టర్‌ జట్టులో ఆడుతున్న పుజారా శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరాడు. షమి బౌలింగ్‌లో బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్‌ తీసుకొని వికెట్లకు తాకడంతో పుజారా నిరాశతో వెనుదిరిగాడు. అయితే, వికెట్‌ సాధించాక షమి సంబరాలు చేసుకుంటూ వెళ్లి పుజారాను వెనక నుంచి హత్తుకున్నాడు.

జడ్డూ బౌలింగ్‌లో పంత్‌..

అలాగే రవీంద్ర జడేజా బౌలింగ్‌లో మరో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ రిషభ్ పంత్‌ (76; 87 బంతుల్లో 14x4, 1x6) ఔటయ్యాడు.  46వ ఓవర్‌లో జడ్డూ వేసిన ఊరించే బంతికి పంత్ భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగ్‌ఆన్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ చేతికి చిక్కాడు. లీసెస్టర్‌ 71/4తో కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన అతడు.. రిషి పటేల్‌ (34)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఆపై వాకర్‌ (34)తోనూ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. చివరికి జట్టు స్కోర్‌ 207 పరుగుల వద్ద జడేజా బౌలింగ్‌లో ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ రెండు వీడియోలను లీసెస్టర్‌ క్రికెట్‌ క్లబ్‌ ట్విటర్‌లో పంచుకుంది. మీరూ వాటిని చూడండి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని