IND vs WI: వరుసగా రెండు బౌండరీలు కొట్టేసరికి.. సిరాజ్‌ ఏం చేశాడో చూడండి..!

వెస్టిండీస్‌ ఓపెనర్‌ షాయ్‌ హోప్‌కు టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ దీటుగా బదులిచ్చాడు. నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఈ...

Published : 07 Feb 2022 11:24 IST

అహ్మదాబాద్‌: వెస్టిండీస్‌ ఓపెనర్‌ షాయ్‌ హోప్‌కు టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ దీటుగా బదులిచ్చాడు. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఈ హైదరాబాదీ పేసర్‌ శుభారంభం ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా పూర్తి చేసిన అతడు తన తర్వాతి ఓవర్‌లో రెండు బౌండరీలు సమర్పించుకున్నాడు. సిరాజ్‌ వేసిన మూడో ఓవర్‌ తొలి బంతిని వదిలేసిన హోప్‌ తర్వాతి రెండు బంతులను వరుసగా బౌండరీలకు తరలించాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా పేసర్‌ నిరాశకు గురికాకుండా నాలుగో బంతిని ఇన్‌స్వింగర్‌ వేశాడు. ఆ బంతిని ఆడిన హోప్‌ ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌గా బౌల్డ్‌ అయి వెనుదిరిగాడు. దీంతో భారత్‌కు శుభారంభం దక్కింది.  ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. టీమ్‌ఇండియా పేసర్ దీటుగా బదులిచ్చాడని అభిమానులు వ్యాఖ్యలు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని