Pat cummins: భారత టీ20 లీగ్‌ వేలంలోకి గ్రీన్‌?.. ఆసీస్‌ కెప్టెన్‌ ఏమన్నాడంటే..

ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ భారత టీ20 లీగ్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ జట్టు కెప్టెన్‌ తెలపాడు. 

Published : 19 Nov 2022 02:15 IST

దిల్లీ: ఆసీస్‌ వన్డే, టెస్టు జట్ల కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ రానున్న భారత టీ20 లీగ్‌లో పాల్గొనడంలేదని ప్రకటించిన విషయం తెలిసిందే. 
అంతర్జాతీయ మ్యాచ్‌లతో తీరిక లేకుండా గడుపుతుండటమే ఇందుకు కారణంగా వెల్లడించాడు. అయితే తమ జట్టు ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ను మాత్రం ఈ ఆటకు దూరం చేయడం లేదని తాజాగా తెలిపాడు. తాను జట్టు కెప్టెన్‌ అయినప్పటికీ.. తమ ఆటగాళ్లకు అలాంటి అవకాశాన్ని వదులుకోవాలని చెప్పలేనంటూ పేర్కొన్నాడు.

గత సీజన్‌లో డేవిడ్‌ వార్నర్‌ స్థానంలో ఓపెనర్‌గా అడుగుపెట్టిన ఈ యువ ఆటగాడు తన పేస్‌ బౌలింగ్‌, చురుకైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో రానున్న టీ20 లీగ్‌ వేలంలోకి రావాలని గ్రీన్‌ భావిస్తే అతడి కోసం భారీగా బిడ్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కమిన్స్‌ స్పందిస్తూ.. ‘‘అవును.. భారత టీ20 లీగ్‌ వేలంలోకి గ్రీన్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి చూద్దాం. ఒక జట్టు కెప్టెన్‌గా నేను కొంత స్వార్థంగా ఆలోచిస్తే..  ఆటగాళ్ల శక్తినంతా దేశం కోసం ఆడేందుకే ఉపయోగించుకోవాలని కోరుకుంటాను. కానీ అటువంటి గొప్ప అవకాశాన్ని వదులుకోవాలని ఎవరికైనా మనం ఎలా సూచించగలం?’’ అంటూ కమిన్స్‌ వివరించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని