
IND vs SA : దూకుడులో తగ్గేదేలే.. బవుమాతో విరాట్‌కోహ్లీ స్వల్ప వాగ్వాదం
ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ సారథిగా చాలా అగ్రెసివ్‌గా ఉంటాడు. మైదానంలో సహచరులను ప్రోత్సహిస్తూ చురుగ్గా వ్యవహరిస్తుంటాడు. దాదాపు ఐదున్నరేళ్ల తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. అందులోనూ అర్ధశతకం సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. కెప్టెన్సీ లేకపోయినా మైదానంలో తన దూకుడులో ‘తగ్గేదేలే’ అని నిరూపించాడు ఈ పరుగుల రారాజు. ఇంతకీ అసలేం అయిందంటే...!
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ బుధవారం జరిగింది. త్వరగానే ప్రొటీస్ మూడు వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ టెంబా బవుమా (110), డస్సెన్ (129*) శతకాలతో ఆదుకున్నారు. అయితే 36వ ఓవర్‌ను యుజువేంద్ర చాహల్ వేస్తున్న సందర్భంలో కోహ్లీ, టెంబా బవుమా మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. చాహల్ వేసిన బంతిని బవుమా కొట్టగా మిడాన్‌లో ఉన్న కోహ్లీ ఒడిసి పట్టుకున్నాడు. వెంటనే కీపర్‌కు బాల్‌ను త్రో చేశాడు. అయితే బంతి బవుమా పైనుంచి వెళ్లింది. ఈ సందర్భంగా ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకున్నారు. కొద్దిసేపటికే వివాదం సద్దుమణిగింది. దక్షిణాఫ్రికా 296 పరుగులు చేయగా.. భారత్ 265 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.