Umran Malik: ఉమ్రాన్‌తో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిస్తే గాయాలబారిన పడతాడు
హైదరాబాద్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను అధికంగా ఉపయోగించుకుంటే గాయాలబారిన పడతాడని టీమ్ఇండియా మాజీ పేసర్ మునాఫ్ పటేల్ అభిప్రాయపడ్డాడు...
టీమ్ఇండియా మాజీ పేసర్ మునాఫ్ పటేల్
(Photos: Umran Malik and Munaf Patel Instagram)
ఇంటర్నెట్‌డెస్క్: హైదరాబాద్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌ను ఎక్కువగా ఉపయోగించుకుంటే గాయాలబారిన పడతాడని టీమ్ఇండియా మాజీ పేసర్ మునాఫ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. అదే జరిగితే అతడు తన పేస్‌ను మార్చుకోవాల్సి వస్తుందన్నాడు. ప్రస్తుతం జరుగుతోన్న 15వ సీజన్లో ఉమ్రాన్ నిలకడగా బౌలింగ్ చేస్తూ 150కిమీ వేగంతో బంతులు సంధిస్తున్నాడు. ప్రతి ఒక్కరి చేత ప్రశంసలు పొందుతున్నాడు. ఈ క్రమంలోనే ఉమ్రాన్ బౌలింగ్‌పై స్పందించిన మునాఫ్ ఇలా చెప్పుకొచ్చాడు.
‘ఉమ్రాన్ బౌలింగ్ చేయడానికి పరుగెత్తుతుంటే నేను కూడా బౌలింగ్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ టీ20 టోర్నీ ద్వారా ఇలాంటి నైపుణ్యమున్న ఆటగాళ్లు వెలుగులోకి రావడం చాలా సంతోషం. మరీ ముఖ్యంగా సరైన వసతులు లేని గ్రామీణ ప్రాంతాల ఆటగాళ్లు ఈ టోర్నీ ద్వారా బయటకు రావడం మంచి విషయం. లేకపోతే అతడు ఎక్కడ ఆడేవాడో ఎవరికి తెలుసు. ఇప్పుడైతే ఈ సీజన్లో అత్యధిక వేగంగా బంతులేస్తున్న బౌలర్‌గా నిలిచాడు’ అని మునాఫ్ చెప్పుకొచ్చాడు.
అలాగే బీసీసీఐ అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయడానికి ఆలస్యం చేయొద్దని, తొలుత దేశవాళీ క్రికెట్లో అవకాశాలిచ్చి తర్వాత టీమ్ఇండియాకు తీసుకురావద్దని చెప్పాడు. ఇప్పటినుంచే జట్టుతో కలిసి పంపాలన్నాడు. దాంతో అతడు అంతర్జాతీయ పరిస్థితులకు త్వరగా అలవాటు పడతాడన్నాడు. అలాగే ఫాస్ట్‌బౌలర్లు ఏడాదికి ఇన్ని మ్యాచ్‌లే ఆడాలనే కచ్చితమైన నిబంధనలు ఉండాలని, తద్వారా ఆటగాళ్లు గాయాలబారిన పడకుండా ఉంటారని అన్నాడు. ఇప్పుడు టెక్నాలజీ, ట్రైయినింగ్, ఫిజియోథెరపీ సదుపాయాలు మెరుగైనా ఉమ్రాన్ మాలిక్ లాంటి ఆటగాడిని జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. ఒకవేళ అతడితో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిస్తే.. గాయాలబారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నాడు. దాంతో ఉమ్రాన్ తన పేస్బౌలింగ్లో మార్పులు చేసుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డాడు. ఇప్పుడైతే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని మునాఫ్ మెచ్చుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు