Ambati Rayudu : అంబటి వ్యవహారం.. టీకప్పులో తుపాను.. ఆందోళన అవసరం లేదు: ఫ్లెమింగ్‌

 ‘ఇదే నా చివరి టీ20 లీగ్’ అంటూ ట్వీట్‌ చేసి కాసేపటికే డిలీట్‌ చేసిన అంబటి రాయుడు వ్యవహారంపై చర్చ కొనసాగుతూనే ఉంది. నిన్న గుజరాత్‌తో మ్యాచ్‌కూ...

Published : 17 May 2022 01:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ‘ఇదే నా చివరి టీ20 లీగ్’ అంటూ ట్వీట్‌ చేసి కాసేపటికే డిలీట్‌ చేసిన అంబటి రాయుడు వ్యవహారంపై చర్చ కొనసాగుతూనే ఉంది. నిన్న గుజరాత్‌తో మ్యాచ్‌కూ రాయుడు తుది జట్టులో లేడు. చెన్నై యాజమన్యానికి రాయుడుకు ఎక్కడో చెడిందనే వాదన జరుగుతోంది. అయితే ఇప్పటికే చెన్నై సీఈవో కాశీ విశ్వనాథ్ ఇలాంటి వ్యాఖ్యలను కొట్టిపడేశారు. అంబటి రాయుడు రిటైర్‌మెంట్ తీసుకోవడం లేదంటూ వివరణ ఇచ్చారు. ఇప్పుడు చెన్నై ప్రధాన కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ కూడా ఆ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చేశాడు. ఇదంతా టీకప్పులో తుపానులాంటిదని పేర్కొన్నాడు. 

గుజరాత్‌తో మ్యాచ్‌ అనంతరం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ మాట్లాడుతూ.. ‘‘గుజరాత్‌తో మ్యాచ్‌లో రాయుడు లేకపోవడం ఏమీ నిరుత్సాహానికి గురి చేయలేదు. ఇప్పుడు వస్తున్న ఆరోపణలన్నీ టీకప్పులో తుపానులాంటివి. రాయుడు బాగానే ఉన్నాడు. ఇలాంటి చర్చ మా క్యాంప్‌పై ప్రభావం చూపదు. అలానే నేను చెప్పిందేమీ స్టోరీ కాదు. అంతా బానే ఉంది’’ అని వివరించాడు. మెగా వేలంలో రాయుడును చెన్నై రూ. 6.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు 12 మ్యాచుల్లో 27.10 సగటుతో 271 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రాయుడు గత శనివారం మధ్యాహ్నం ‘నాకు ఇదే చివరి టీ20 లీగ్‌ సీజన్‌’ అని ట్వీట్ చేశాడు. అయితే కాసేపటికే దానిని డిలీట్ చేశాడు. దీనిపై చెన్నై ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథ్‌ స్పందిస్తూ..  ‘‘ప్రస్తుత సీజన్‌లో సరిగా రాణించలేకపోయాననే నిరుత్సాహంతో ఉన్నాడు. అందుకే పొరపాటున ట్వీట్ చేశాడు. నేను ఇప్పటికే అతడితో మాట్లాడాను. అతడేమీ రిటైర్‌మెంట్ తీసుకోవడం లేదు. మాతోనే ఉంటాడు’’ అని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని