Medaram 2022: ప్రజల జీవన విధానాన్ని తెలుసుకునేందుకే రోడ్డు మార్గంలో వచ్చా: తమిళిసై

మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. జాతర చివరి రోజు కావడంలో గత రెండు రోజులతో పోల్చితే ఇవాళ భక్తులు

Published : 19 Feb 2022 16:53 IST

ములుగు: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. జాతర చివరి రోజు కావడంలో గత రెండు రోజులతో పోల్చితే ఇవాళ భక్తులు భారీ సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. దీంతో మేడారం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అమ్మవార్లకు బంగారం సమర్పించిన భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం వెళ్లిన రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. వన దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన ప్రజలందరికీ సమ్మక్క-సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు అందరూ ఐశ్వర్యం, సంతోషం, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని అమ్మవార్లను ప్రార్థించినట్లు గవర్నర్‌ తెలిపారు.

గవర్నర్‌ మాట్లాడుతూ.. ‘‘భక్తులతో కలిసి అమ్మవార్లను దర్శించుకోవాలనుకున్నాను. రాష్ట్ర గవర్నర్‌గా నాకు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అడగలేదు. అయితే ప్రొటోకాల్‌ ప్రకారం అధికారులు ఏర్పాట్లు చేసి ప్రత్యేకంగా దర్శనం కల్పించారు. నేను ప్రజల్లో ఒకదానిగా ఉండాలని అనుకుంటున్నాను. సాధారణ భక్తుల మాదిరిగానే సమ్మక్క-సారలమ్మను దర్శించుకోవాలన్నది నా ఆకాంక్ష. అందరినీ కలిసి ఇక్కడి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకునేందుకే హెలికాప్టర్‌లో కాకుండా రోడ్డు మార్గంలో వచ్చాను. నా పర్యటన వల్ల సాధారణ భక్తులు అసౌకర్యానికి గురైతే నన్ను మన్నించాలి. రానున్న రోజులత్లో ఆదివాసీల కోసం అనేక కార్యక్రమాలను తీసుకొస్తున్నాం. ఆదివాసీలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వారిలో ఈ సమస్య నివారణకు ప్రయత్నిస్తున్నాను. ఇప్పటికే చికిత్సలు, మహబూబా లడ్డూలు పంపిణీ చేశాం. ప్రభుత్వ సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఉంది’’ అని గవర్నర్ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు