ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు 30 శాతం జీతం పెంపు

రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) పరిధిలో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగు సేవలు తదితర అన్ని రకాల ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా

Published : 28 Nov 2021 05:04 IST

గత జూన్‌ నుంచి   పెరిగిన వేతనాల చెల్లింపు
ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
18,600 మంది ఒప్పంద, పొరుగుసేవల సిబ్బందికి లబ్ధి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) పరిధిలో పనిచేస్తున్న ఒప్పంద, పొరుగు సేవలు తదితర అన్ని రకాల ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా శనివారం జీఓ 117 జారీచేశారు. దీనివల్ల రాష్ట్రంలోని కేజీబీవీలు, మోడల్‌ పాఠశాలల హాస్టళ్లు, ఎంఈఓ, డీఈఓ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది సహా 18,600 మందికి లబ్ధి కలగనుంది. కొత్త వేతనాలను ఈ ఏడాది జూన్‌ నెల నుంచి వర్తింపజేస్తున్నట్టు జీవోలో పేర్కొనడాన్ని బట్టి..ఆరు నెలల బకాయిలను కూడా వారు అందుకోనున్నారు. వాస్తవానికి ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకూ జీతాలు పెంచుతామని ప్రభుత్వం గత బడ్జెట్‌ సమావేశాల్లోనే ప్రకటించింది. ఆలస్యంగానైనా ఉత్తర్వులు విడుదలకు సహకరించిన ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ఉన్నతాధికారులకు టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. కనీస వేతనాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని