హరితం అల్లుకుంది.. చల్లదనం పరుచుకుంది!

మండుటెండల్లో ఉక్కపోతతో అందరూ అవస్థలు పడుతుంటే.. దిల్‌సుఖ్‌నగర్‌ గౌతమ్‌నగర్‌ కాలనీకి చెందిన సత్యవతి కుటుంబం మాత్రం ఆహ్లాదంగా కాలం గడుపుతోంది.

Published : 23 May 2022 04:33 IST

మండుటెండల్లో ఉక్కపోతతో అందరూ అవస్థలు పడుతుంటే.. దిల్‌సుఖ్‌నగర్‌ గౌతమ్‌నగర్‌ కాలనీకి చెందిన సత్యవతి కుటుంబం మాత్రం ఆహ్లాదంగా కాలం గడుపుతోంది. కారణం..15 ఏళ్లుగా పెంచుతున్న తూర్పు ఆసియాకు చెందిన ఓ తీగజాతి మొక్క. ఫైకస్‌ పుమీల అనే శాస్త్రీయ నామంగల ఈ మొక్క రెండంతస్తుల భవనమంతా విస్తరించింది. ఫలితంగా బయటి కంటే ఇంట్లో కనీసం మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటోందని, ఉక్కపోత బాధ లేనేలేదని సత్యవతి చెప్పారు. ఈ తీగ జాతి మొక్క గోడలకు ఎలాంటి హానీ చేయదని, ఇంటిని చల్లబరిచి, అందాన్నిస్తుందని జడ్చర్లలోని బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్‌ బి.సదాశివయ్య తెలిపారు.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని