డీఆర్‌డీవో క్షిపణుల వ్యూహాత్మక వ్యవస్థల డీజీగా రాజాబాబు

రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన హైదరాబాద్‌లోని క్షిపణులు, ప్యూహాత్మక వ్యవస్థల (ఎంఎస్‌ఎస్‌) డైరెక్టర్‌ జనరల్‌గా ఉమ్మలనేని రాజాబాబు నియమితులయ్యారు.

Published : 01 Jun 2023 04:22 IST

ఆర్‌సీఐకి త్వరలో కొత్త డైరెక్టర్‌

ఈనాడు, హైదరాబాద్‌: రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన హైదరాబాద్‌లోని క్షిపణులు, ప్యూహాత్మక వ్యవస్థల (ఎంఎస్‌ఎస్‌) డైరెక్టర్‌ జనరల్‌గా ఉమ్మలనేని రాజాబాబు నియమితులయ్యారు. రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ) డైరెక్టర్‌గా ఉన్న ఆయన పదోన్నతిపై డీజీ అయ్యారు. జూన్‌ 1 నుంచి నియామకం అమల్లోకి వస్తుందని డీఆర్‌డీవో బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. మే 31న డీజీగా పదవీ విరమణ చేసిన డాక్టర్‌ బీహెచ్‌వీఎస్‌ నారాయణమూర్తి స్థానంలో రాజాబాబును నియమించారు. 35 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణి వ్యవస్థల అభివృద్ధిపై రాజాబాబు పనిచేశారు. ఆర్‌సీఐలో ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌గా బాలిస్టిక్‌ మిసైల్స్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ సామర్థ్యాల రూపకల్పన, అభివృద్ధిలో కృషిచేశారు. భారత్‌ మొట్టమొదటి ఉపగ్రహ క్షిపణి పరీక్ష ‘మిషన్‌ శక్తి’ని ఈయన నేతృత్వంలో విజయవంతంగా పరీక్షించారు. రాజాబాబు ఆంధ్రా వర్సిటీ నుంచి మెకానిక్‌ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఐఐటీ ఖరగ్‌పుర్‌ నుంచి మాస్టర్స్‌, జేఎన్‌టీయూ నుంచి ఎంబీఏ చేశారు. 1988లో వైమానిక దళంలో కెరీర్‌ ప్రారంభించిన ఆయన.. 1995లో డీఆర్‌డీవోలో చేరారు. ఆర్‌సీఐకి డైరెక్టర్‌ను నియమించే వరకూ రాజాబాబు ఇన్‌ఛార్జ్‌గా ఉండనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని