భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు

పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది.

Updated : 19 Apr 2024 06:26 IST

పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. అలాంటి ఘటనే రాష్ట్ర సరిహద్దు.. మహారాష్ట్రలోని తడోబా టైగర్‌ రిజర్వు కోర్‌ ఏరియాలో జరిగింది. కల్వర్టు పక్కన ఎండిన నీటి కుంటలో ఉన్న ఎలుగుబంటి వైపు పులి వెళ్లింది. అంతే.. భల్లూకం ఒక్క ఉదుటున లేచి ముందుకు నడుస్తూ పెద్దపులి కళ్లలో కళ్లు పెట్టి చూసింది. భయంతో పులి వెనక్కి ఒక్కో అడుగు వేసింది. అయినా ఎలుగుబంటి ఆ పెద్దపులిని పరుగులు పెట్టించింది. ఈ దృశ్యాల్ని జీపులో వెళుతున్న ఓ పర్యాటకుడు తన కెమెరాలో బంధించగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని