సీఎం సభలో వడదెబ్బ.. వృద్ధుడి మృతి

సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభకు వచ్చిన ఓ వ్యక్తి వడదెబ్బకు బలైన సంఘటన వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరులో చోటుచేసుకుంది.

Published : 01 May 2024 05:45 IST

ట్రాఫిక్‌ అడ్డంకులను దాటుకొని ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మరణం

ఖాజీపేట, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభకు వచ్చిన ఓ వ్యక్తి వడదెబ్బకు బలైన సంఘటన వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరులో చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌ మంగళవారం మధ్యాహ్నం మైదుకూరు నాలుగురోడ్ల కూడలిలో ప్రచార సభ నిర్వహించారు. ఖాజీపేట మండలం సి.కొత్తపేట పంచాయతీ కొత్తనెల్లూరుకు చెందిన ఊసుపల్లె అంకయ్య(76) ఈ సభకు వెళ్లారు. అక్కడ నాయకులు సభకు వచ్చిన వారందరికీ మద్యం సరఫరా చేశారు. అంకయ్య కూడా మద్యం తాగి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. కొద్దిసేపటికే ఎండకు తాళలేక వడదెబ్బ తగిలి అక్కడే కుప్పకూలారు. గ్రామస్థులు వెంటనే అంకయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు యత్నించినా మైదుకూరులో ట్రాఫిక్‌ కారణంగా ఆటోలో ఖాజీపేటకు తరలించాల్సి వచ్చింది. అక్కడ కూడా వైద్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో చెన్నూరులోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందారు. భర్త మృతి విషయం తెలుసుకున్న అంకయ్య భార్య అక్కయ్య సొమ్మసిల్లిపడిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని