జగనన్న వస్తున్నారు... మిద్దెలపైకి నోఎంట్రీ!

సీఎం జగన్‌ పర్యటన ఉందంటే చాలు... ఆ ప్రాంతాల్లో ఆంక్షలకు అడ్డూ, అదుపు ఉండనే ఉండదు. చెట్లు నరికి వేయడం, విద్యుత్తు సరఫరా తొలగించడం, ట్రాఫిక్‌ను అడ్డగోలుగా ఆపేయడం ఇవి సర్వసాధారణం.

Updated : 01 May 2024 08:06 IST

కలికిరి గ్రామీణ, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ పర్యటన ఉందంటే చాలు... ఆ ప్రాంతాల్లో ఆంక్షలకు అడ్డూ, అదుపు ఉండనే ఉండదు. చెట్లు నరికి వేయడం, విద్యుత్తు సరఫరా తొలగించడం, ట్రాఫిక్‌ను అడ్డగోలుగా ఆపేయడం ఇవి సర్వసాధారణం. అయితే మంగళవారం కలికిరిలో జరిగిన సీఎం సభలో తమ ఆంక్షల్లో మరో కొత్త అంశాన్ని పోలీసులు జోడించారు. నాయకుల రోడ్‌షోలు, బస్సు యాత్రలు జరిగేటప్పుడు వారిని చూసేందుకు సాధారణంగా ఆ ప్రాంతంలోని ఇళ్ల యజమానులు, చుట్టుపక్కల వారు మిద్దెలను ఎక్కుతుంటారు. సీఎం సభలకు రోడ్లపై పెద్దఎత్తున్న జనం కన్పించేలా చేయాలనో, లేక మరేం భావించారో తెలియదు కానీ భవనాలపైకి ఎక్కడాన్ని నిషేధించారు. కలికిరి క్రాస్‌ రోడ్డులోని ఆర్టీసీ బస్టాండు, కలకడ మార్గానికి ఇరువైపులా ఉన్న ఇళ్లు, దుకాణాల యజమానులకు ఈ మేరకు పోలీసులు అల్టిమేటం జారీ చేశారు. భవనాల మెట్ల వద్ద పోలీసులను కూడా కాపలాగా పెట్టడంతో ఇదేమి విడ్డూరం అంటూ స్థానికులు నిట్టూర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని