మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి హైకోర్టులో ఊరట

మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.

Published : 01 May 2024 05:44 IST

ఈనాడు, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. చిత్తూరు జిల్లా రొంపిచర్ల పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా కిరణ్‌కుమార్‌రెడ్డి ఈనెల 7న చిత్తూరు జిల్లా రొంపిచర్ల బస్టాండ్‌ ప్రాంతంలో సమావేశం నిర్వహించారంటూ.. ఎంపీడీవో కె.రెడ్డెప్ప ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని కిరణ్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎన్వీ సుమంత్‌ వాదనలు వినిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని