‘గోవిందకోటి’ పూర్తిచేసిన కర్ణాటక విద్యార్థిని

కర్ణాటకలోని బెంగళూరులో ఇంటర్‌ చదువుతున్న కీర్తన 10,01,116 సార్లు గోవింద నామాలు రాసి తితిదే ‘గోవిందకోటి’ పథకం కింద మొట్టమొదటిసారిగా వీఐపీ బ్రేక్‌ దర్శనం పొందారు.

Updated : 01 May 2024 07:06 IST

తిరుమల, న్యూస్‌టుడే: కర్ణాటకలోని బెంగళూరులో ఇంటర్‌ చదువుతున్న కీర్తన 10,01,116 సార్లు గోవింద నామాలు రాసి తితిదే ‘గోవిందకోటి’ పథకం కింద మొట్టమొదటిసారిగా వీఐపీ బ్రేక్‌ దర్శనం పొందారు. కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం తిరుమలకు చేరుకున్న కీర్తన..గోవింద నామాలు రాసిన పుస్తకాన్ని తితిదేకు అందజేశారు. అధికారులు ఆమెకు స్వామివారి వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా తితిదే ఛైర్మన్‌ కరుణాకర్‌రెడ్డి విద్యార్థినిని అభినందించారు. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గోవిందకోటి పథకం ప్రవేశపెట్టినట్లు ఆయన వెల్లడించారు. కోటి నామాలు రాసిన విద్యార్థులు, యువతతోపాటు వారి కుటుంబ సభ్యులందరికీ వీఐపీ బ్రేక్‌ కల్పిస్తామని తితిదే ప్రకటించిందని గుర్తుచేశారు. దర్శనానంతరం కీర్తన మీడియాతో మాట్లాడుతూ.. ‘గోవిందకోటి’ రాసే అవకాశం కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. 2023 నవరాత్రుల నుంచి రాయడం ప్రారంభించి పూర్తిచేసినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని