గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రికార్డు

రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. ఏప్రిల్‌లో 46 డిగ్రీలు నమోదు కావడమే అరుదనుకుంటే మంగళవారం అత్యధికంగా కర్నూలు జిల్లా జి.సింగవరంలో గరిష్ఠంగా 46.4 డిగ్రీలు, నంద్యాల జిల్లా గోస్పాడులో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Published : 01 May 2024 06:48 IST

కర్నూలు జిల్లా జి.సింగవరంలో 46.4 డిగ్రీలు నమోదు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. ఏప్రిల్‌లో 46 డిగ్రీలు నమోదు కావడమే అరుదనుకుంటే మంగళవారం అత్యధికంగా కర్నూలు జిల్లా జి.సింగవరంలో గరిష్ఠంగా 46.4 డిగ్రీలు, నంద్యాల జిల్లా గోస్పాడులో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 15 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. 67 మండలాల్లో తీవ్ర వడగాలులు, 83 మండలాల్లో వడగాలులు వీచాయి. బుధవారం 34 మండలాల్లో తీవ్ర వడగాలులు, 216 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని