నేర్పండి... నేర్చుకోండి...

సాధారణంగా కొత్త సంవత్సరం అంటే విందులు, వినోదాలు, కార్డులు, కానుకలతో సందడిచేస్తాం. కానీ ఇంకాస్త ప్రత్యేకంగా, ప్రయోజనకరంగా ఉండాలంటే ఆత్మీయులతో వర్చువల్‌ మీటింగ్‌ పెట్టుకుని ఏమైనా నేర్పండి లేదా నేర్చుకోండి.

Published : 28 Dec 2022 00:50 IST

సాధారణంగా కొత్త సంవత్సరం అంటే విందులు, వినోదాలు, కార్డులు, కానుకలతో సందడిచేస్తాం. కానీ ఇంకాస్త ప్రత్యేకంగా, ప్రయోజనకరంగా ఉండాలంటే ఆత్మీయులతో వర్చువల్‌ మీటింగ్‌ పెట్టుకుని ఏమైనా నేర్పండి లేదా నేర్చుకోండి. ఇదేంటి.. విసుగేయదా అని సందేహించకండి. ఇది కచ్చితంగా కొత్తదనాన్ని నింపుతుంది, ఆనందాలు పంచుతుంది. ఎందుకంటారా...

* ఒకే ఊళ్లో ఉంటున్నా.. ట్రాఫిక్‌జామ్‌లు, కాలుష్యాల వల్ల బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లడం కష్టమైన వ్యవహారంగా ఉంటోంది. వెళ్లినా ఒకరింటికే వెళ్లగలం. అదే వర్చువల్‌ మీటింగ్‌ అయితే మరింతమందిని ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగానే మాట్లాడొచ్చు. అందరూ ఒక చోట చేరితే ఇక సందడికేం లోటు. సరదాగా ముచ్చటించుకుంటూ నేర్పచ్చు, నేర్చుకోవచ్చు.

* సాధారణ కూరలూ పచ్చళ్లు అయితే యూట్యూబ్‌లో వెతికి ఎలా చేయాలో తెలుసుకోవచ్చు. కానీ ఒక్కో వ్యక్తికీ వారిదైన ప్రత్యేక వంటకాలు ఉంటాయి. అలాంటి అరుదైన వంటకాలను మీ ప్రియసఖి దగ్గర తెలుసుకుంటే బాగుంటుంది కదా! జూమ్‌లో ఉన్న వేరేవాళ్లు కూడా ఇంకొన్ని సూచనలు చేశారనుకోండి.. ఆహా కొత్త సంవత్సరం రోజున మీ వంటకు ఎన్ని ప్రశంసలో!

* మీ నేస్తం కూతురు మేథస్సు ఉండి కూడా ఇంటర్య్వూలోనో వైవాలోనో కాళ్లూ చేతులూ వణుకుతున్నాయని, ఎంపిక కావడం లేదని తెలిసింది. మీ వాక్చాతుర్యంతో స్ఫూర్తి కలిగించే మాటలు చెప్పండి. అలా ధైర్యాన్ని నూరిపోసి ఇంటర్వ్యూ ఫోబియా నుంచి బయటపడేస్తే సంతోషంగా, సంతృప్తిగా ఉండదూ! ముఖ్యంగా మీ నెచ్చెలి మురిసిపోతుంది. అంతేనా.. రేపు ఉద్యోగం సాధించాక ‘నీ వల్లే పెద్దమ్మా’ అంటూ ఆ అమ్మాయొచ్చి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటుంది.

* కుట్లూ అల్లికలూ, ఫ్యాబ్రిక్‌ పెయింట్లు, ప్యాచ్‌ వర్క్‌, డిజైనర్‌ జాకెట్లు, ఇంటిని అందంగా సర్దుకోవడం, గోడల మీద అలంకరణ, బొమ్మల తయారీ, నృత్యం, సంగీతం, పెయింటింగులు.. ఒకటేమిటి.. మీకు చేతనైంది ఏదైనా నేర్పించవచ్చు. రానిది నేర్చుకోవచ్చు. అందరూ ఆప్తులే కనుక అది క్లాసులో పాఠం వింటున్నట్లు కాకుండా ఛలోక్తులతో సరదాగా సాగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్