Couple: హేళన చేయకండి

ఆలుమగల మధ్య గొడవ ఏదైనా సరే... ఇరువైపులా ఎవరి వాదనలు వారికి ఉంటాయి. అలాగని వాటిని తెగేదాకా లాగితే ఇబ్బందే.

Published : 27 Mar 2023 00:04 IST

ఆలుమగల మధ్య గొడవ ఏదైనా సరే... ఇరువైపులా ఎవరి వాదనలు వారికి ఉంటాయి. అలాగని వాటిని తెగేదాకా లాగితే ఇబ్బందే. సమస్య ఎదురైనప్పుడు... గొడవకు కారణాలు వెతక్కుండా సర్దుకుపోవడానికి దారులేమున్నాయో గమనించండి. మీ కాపురం సంతోషంగా సాగిపోతుంది.

* కలకాలం సంతోషంగా సాగాల్సిన దాంపత్యంలో కొన్నిసార్లు చిన్న విషయాలే ఎక్కువ చికాకు పెడుతుంటాయి. ముఖ్యంగా దాపరికాలు... అనుమానాల్నీ, అపార్థాల్నీ తెచ్చిపెడతాయి. అలాంటి పరిస్థితి ఎదురైతే...ఇంకా ఆ విషయానికి ముసుగేయొద్దు. కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని అబద్ధాలూ చెప్పొద్దు. అలా చేస్తే పరిస్థితి మరింత జటిలం అవుతుంది. ఇక, ప్రతి చిన్న విషయమూ నా కనుసన్నల్లోనే జరగాలి అనుకునే తత్వమూ సరికాదు. చేసే పనిలో కొంత స్వేచ్ఛ ఉన్నప్పుడే ఇలాంటి సమస్యలు దరిచేరవు.

* మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు అయినా ఉండొచ్చు. అయితే వాటిని పదిమందిలోనూ చర్చించాలనుకోవడం పొరబాటు. అలానే భాగస్వామిని తక్కువ చేస్తూ, హేళన చేస్తూ ఇతరుల ముందు మాట్లాడం కూడా తప్పే. మొదట సరదాగా మొదలయ్యే ఈ అలవాటుతో కాపురాలే కూలిపోవచ్చు. ఒకరినొకరు తక్కువగా చూపించాలనుకోవడం వల్ల ఇద్దరూ చులకన అవుతారు. మీరు ఒకరినొకరు గౌరవించుకుంటేనే...ఇతరులూ మీ విషయంలో అలానే ఉంటారు.

* మీ ఇద్దరి మధ్య గొడవల్లో ప్రతి విషయానికీ ఇతరులను మధ్యవర్తిత్వం చేయమనడం, సాక్ష్యాలు చెప్పమనడం సరికాదు. దీనివల్ల సమస్యలు మరింత పెరిగిపోతాయి. ముందు మీ ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోండి. దీనివల్ల వాదనలు పెరిగిపోతున్నాయి అనుకుంటే... మీ సమస్యని ఓ కాగితం మీద రాసి షేర్‌ చేసుకోండి. అప్పుడు పదును తగ్గుతుంది. సమస్య పరిష్కారం దిశగా సాగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్