పిల్లలు పుట్టక ముందైతే ఇవి మరింత ఈజీ!

జీవితంలో ఒక్కో వయసులో ఒక్కో రకమైన బాధ్యతలుంటాయి. పెళ్లికి ముందు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించడం ఒక బాధ్యతైతే; పెళ్లి తర్వాత భాగస్వామితో కలిసి బాధ్యతలు పంచుకోవడం, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ల ఆలనాపాలనా చూడడం, ఆ తర్వాత పెద్దవాళ్లను....

Updated : 30 Jun 2022 19:37 IST

జీవితంలో ఒక్కో వయసులో ఒక్కో రకమైన బాధ్యతలుంటాయి. పెళ్లికి ముందు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించడం ఒక బాధ్యతైతే; పెళ్లి తర్వాత భాగస్వామితో కలిసి బాధ్యతలు పంచుకోవడం, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ల ఆలనాపాలనా చూడడం, ఆ తర్వాత పెద్దవాళ్లను చూసుకోవడం.. ఇలా ఒకదాని తర్వాత మరొకటి క్యూలో ఉంటాయి. జీవితమంతా ఇలా బిజీ బిజీగానే గడిచిపోతుంటే ఇంక ఎంజాయ్ చేసేదెప్పుడు అంటారా? అదే.. అక్కడికే వస్తున్నాం.. ముఖ్యంగా పెళ్లి తర్వాత, పిల్లలు పుట్టకముందు.. ప్రతి మహిళ చేయాల్సిన కొన్ని పనులున్నాయి.. మరి అవేంటో చదివేయండి మరి..

పొదుపు చేస్తున్నారా?

పిల్లలు పుట్టకముందు ప్రారంభించాల్సిన అతి ముఖ్యమైన పని పొదుపు చేయడం. పెళ్త్లెన తొలినాళ్ల నుంచే పొదుపు చేయడం మొదలుపెడితే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్లకు ఎలాంటి లోటు లేకుండా చూసుకోవచ్చు. లేదంటే దాని ప్రభావం పిల్లల బంగారు భవిష్యత్తుపై పడుతుంది. కాబట్టి పెళ్లి తర్వాత ఖర్చులను అదుపులో ఉంచుకొని భాగస్వామితో కలిసి పొదుపు చేయడం మొదలుపెట్టడం మంచిది.

సరదాగా గడిపేయండి..

పెళ్లయ్యాక.. సినిమాలకు, షికార్లకు అంతే ఉండదు. అయితే పిల్లలు పుట్టారంటే ఈ సరదాలన్నిటినీ కొంతకాలం కట్టిపెట్టాల్సిందే. అందుకే పిల్లలు పుట్టకముందే దంపతులిద్దరూ సరదాగా గడపడం, కొత్త ప్రదేశాలను చూసి రావడం.. ఇలా ఇద్దరూ కలిసి వీలైనంతగా ఎంజాయ్ చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్యా దూరాలేమైనా ఉంటే తొలగిపోయి.. అర్థం చేసుకునే మనస్తత్వం కూడా పెరుగుతుంది.

స్నేహితులతో కలిసి..

స్నేహితులతో కలిసి కాస్త సమయం గడపాలని ఎవరికైనా ఉంటుంది కదండీ.. అది పెళ్లయిన ఆడవాళ్లకైనా సరే.. అయితే పిల్లలు పుట్టిన తర్వాత ఇలాంటి అవకాశం అంతగా రాకపోవచ్చు. కాబట్టి పిల్లల బాధ్యత ఏర్పడకముందే మీ ఫ్రెండ్స్, మీరు కలిసి సరదాగా గడపడానికి ప్లాన్ చేసుకోవడం వల్ల ఆ ఎంజాయ్‌మెంట్ మిస్సయ్యామన్న దిగులుండదు.

సాహసం చేయాలనుందా?

కొంతమంది మహిళలకు సాహసకృత్యాలు చేయడమంటే చాలా ఇష్టం. కానీ పిల్లలు పుట్టిన తర్వాత శరీరం సహకరించకో, లేదంటే ఇతర కారణాల వల్లో వెనకడుగు వేస్తుంటారు. కాబట్టి ముందుగానే ఇలాంటి సాహసకృత్యాలేవైనా చేయాలనుంటే చేసేయడం మంచిది.

అభిరుచుల కోసం..

కొంతమందికి పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. మరికొందరికి గార్డెనింగ్ అంటే ఇష్టం. మరొకరికి మరోటంటే ఇష్టం. కానీ పిల్లలు పుట్టిన తర్వాత వీటన్నింటికీ అంత సమయం దొరక్కపోవచ్చు. అందుకే పిల్లలు పుట్టకముందే మీ అభిరుచులు నెరవేర్చుకోవడానికి కూడా తగినంత సమయం కేటాయించాలి.

గుర్తుంచుకోండి!

ఇక్కడ చెప్పినవన్నీ కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. మీకు వ్యక్తిగతంగా మరిన్ని ఆసక్తులు, అభిరుచులు ఉండచ్చు. పిల్లలు పుట్టక ముందు అంతగా బాధ్యతలు ఉండవు కాబట్టి వాటిని నెరవేర్చుకోవడానికి అప్పుడే తగినంత సమయం కేటాయించాలన్నది మాత్రమే ఇక్కడ మనం గమనించాలి. అంతేతప్ప- పిల్లలు పుట్టినంత మాత్రాన ఇక జీవితం అయిపోయిందనుకోవద్దు.. వ్యక్తిగత సరదాలు సంతోషాలకు ఇంక ఏమాత్రం తావుండదు అని భావించద్దు.. పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత కూడా వయసుతో సంబంధం లేకుండా తమ అభిరుచులు నెరవేర్చుకుంటున్న, లక్ష్యాలు సాధిస్తున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు.. అలాంటివాళ్లే మనకు ఆదర్శం కావాలి! గుర్తుంచుకోండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్