అబద్ధాలు మాన్పించాలంటే...

పిల్లలు బోల్డన్నిసార్లు అబద్ధాలు చెబుతారు. పాఠం చదవకుండానే చదివేశాననడం, నోట్సు రాయాల్సి ఉన్నా లేదనడం, లంచ్‌బాక్స్‌లో అన్నం పడేసి తిన్నానని చెప్పడం.. ఇలాంటివెన్నో.. అంత మాత్రాన వాళ్లేమీ

Updated : 06 Apr 2022 01:24 IST

పిల్లలు బోల్డన్నిసార్లు అబద్ధాలు చెబుతారు. పాఠం చదవకుండానే చదివేశాననడం, నోట్సు రాయాల్సి ఉన్నా లేదనడం, లంచ్‌బాక్స్‌లో అన్నం పడేసి తిన్నానని చెప్పడం.. ఇలాంటివెన్నో.. అంత మాత్రాన వాళ్లేమీ మోసకారులో, నేరస్థులో కాదు. కానీ అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారితే మాత్రం భవిష్యత్తులో కష్టమే. ఇంతకీ అబద్ధాలెందుకు చెబుతారు, ఎలా మానిపించాలి? అంటే నిపుణుల సూచనలు.

* పిల్లలు ఆటపాటలతో కాలక్షేపం చేస్తూ తమకు ఇష్టంలేని పనిని తప్పించుకునేందుకు, అమ్మానాన్నలు దండిస్తారనే భయం ఉన్నప్పుడు అబద్ధం చెబుతారు. మీ చిన్నారి అబద్ధం చెప్పినప్పుడు దానికి కారణాన్ని విశ్లేషించండి. చేసిన తప్పు వల్ల ఎంత నష్టమో, దానిని అబద్ధంతో కప్పేయాలని చూడటం వల్ల మరిన్ని అనర్థాలు ఎలా వాటిల్లుతాయో నెమ్మదిగా వివరించండి.

* చదువు, క్రమశిక్షణ లాంటి విషయాల్లో మరీ ఆంక్షలు పెడితే, వాటిని తట్టుకోలేక కూడా అబద్ధాలు చెబుతారు. కనుక వాళ్ల తెలివితేటలు, సామర్థ్యాన్ని అర్థం చేసుకుని ఆ ప్రకారం నడుచుకోవాలి. వారి స్థాయికి మించి నిబంధనలు పెడితే అబద్ధం చెప్పడమే కాదు, ఒత్తిడి లోనవుతారు.

* అబద్ధం పెద్దవాళ్లకు మినహాయింపు అనుకోవద్దు. బంధు మిత్రులతో మీరు అబద్ధాలు చెబుతుంటే తాము మాత్రం చెబితే తప్పేమిటి అనుకుంటారు పిల్లలు. వాళ్లకు మనమే ఆదర్శమని మర్చిపోకండి.

* ఒకసారి అబద్ధం చెబితే అది అలవాటుగా మారుతుందని, అలాంటి ముద్రపడితే తర్వాత నిజం చెప్పినా సందేహిస్తారు.. అది అవమానకరంగా ఉంటుందని చెప్పండి. నిజాయతీపరులకు ఎంత విలువ, గౌరవం ఉంటాయో కథల రూపంలో తెలియజేయండి.

* పుస్తకాలు సర్దుకో, సాక్సు, బూట్లు తీసి సిద్ధంగా పెట్టుకో- లాంటి మాటలు నువ్వు చెప్పనేలేదని వాదిస్తోంటే ‘అటెన్షన్‌ డెఫిషియంట్‌ హైపరాక్టివిటీ డిజార్డర్‌’ (ఎడీహెచ్‌డీ) అయ్యుండొచ్చు. సామర్థ్యం లేక లేదా మతిమరపు ఎక్కువై అబద్ధాలు చెబుతుండవచ్చు. కనుక తరచూ ఇదే జరుగుతుంటే వైద్యుని సంప్రదించడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్