చిట్టి తల్లికి హెలికాప్ట్టర్‌తో స్వాగతం!

అమ్మానాన్నలుగా మారడం జీవితంలో ఎవరికైనా అత్యంత ఆనందకరమైన సందర్భం. పుట్టే పాపాయి కోసం ఆ కన్నవారు ఎన్నో కలలు కంటారు. అలా కూతురు పుట్టిందన్న ఆనందాన్ని ఆ తండ్రి సంబురంగానే కాదు...

Published : 07 Apr 2022 01:27 IST

మ్మానాన్నలుగా మారడం జీవితంలో ఎవరికైనా అత్యంత ఆనందకరమైన సందర్భం. పుట్టే పాపాయి కోసం ఆ కన్నవారు ఎన్నో కలలు కంటారు. అలా కూతురు పుట్టిందన్న ఆనందాన్ని ఆ తండ్రి సంబురంగానే కాదు... అట్టహాసంగానూ చేశాడు. తన గారాల పట్టిని హెలికాప్టర్‌లో ఇంటికి తీసుకువచ్చాడు.

మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం దేశమంతా సంతోషంగా, ఆశ్చర్యంతో తన వైపు చూసేలా చేసింది. షెల్గావ్‌ (పుణె)కు చెందిన ఓ కుటుంబం తమ ఇంట్లోకి వస్తున్న కొత్త అతిథికి ఈ విధంగా స్వాగతం పలికింది. ‘మా కుటుంబంలో అమ్మాయి పుట్టడం ఇదే మొదటిసారి కావడంతో ఇలా ఘనంగా స్వాగతం పలికాం, ఆసుపత్రి నుంచి ఇంటి దాకా లక్ష రూపాయలు ఖర్చు చేసి హెలికాప్టర్‌లో తీసుకువచ్చాం’ అంటూ ఆ పాపాయి తండ్రి విశాల్‌ ఝరేకర్‌ సంతోషంగా చెబుతున్నాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్