పసిపాపకు కంగారూ కేర్‌

వేసవి గాలుల ప్రభావం రోజురోజుకీ పెరుగుతోంది. ఈ సమయంలో పుట్టిన నవజాత శిశువు సంరక్షణలో ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలంటున్నారు వైద్యనిపుణులు. వాటి గురించి వివరిస్తున్నారిలా.

Published : 18 Apr 2022 00:48 IST

వేసవి గాలుల ప్రభావం రోజురోజుకీ పెరుగుతోంది. ఈ సమయంలో పుట్టిన నవజాత శిశువు సంరక్షణలో ప్రత్యేకంగా జాగ్రత్త వహించాలంటున్నారు వైద్యనిపుణులు. వాటి గురించి వివరిస్తున్నారిలా.

గదిలో... వైద్యుల సూచనలు తీసుకుని ఆ మేరకు పాపాయి గది వాతావరణం ఉండేలా చూడాలి. మంచంపై  మృదువైన వస్త్రాలతో పక్క ఏర్పాటు చేయాలి. డిజిటల్‌ థర్మామీటర్‌ ద్వారా గది వెచ్చదనం 36.5-37.4 డిగ్రీల సెల్సియస్‌ ఉండేలా చూసుకోవాలి. తక్కువ వెలుతురు చిన్నారికి సౌకర్యంగా ఉంటుంది. అత్యవసరమైనప్పుడు తప్ప మిగతా సమయమంతా పాపాయిని గదిలోనే ఉంచాలి. పక్క తడిస్తే ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. 

స్నానం.. ఈ సమయంలో మరింత జాగ్రత్త వహించాలి. పాపాయికి సరిపోయే టబ్‌ను ఎంచుకోవాలి. గోరువెచ్చని నీటితోనే స్నానం చేయించాలి. వైద్యుల సలహాతోనే బాత్‌లోషన్స్‌, సబ్బులను వినియోగించడం మొదలుపెట్టాలి. చిన్నారి మృదువైన చర్మాన్ని చేత్తో కాకుండా మెత్తని స్పాంజితో రుద్ది స్నానం చేయించడం మంచిది.

జాగ్రత్తలు... నిద్రలో ఉన్నప్పుడు బుజ్జాయి తేలికగా శ్వాస తీసుకునేలా చూడాలి. తల్లి స్తన్యం అందించి పాలుపట్టాక,  ఛాతీకి హత్తుకునేలా బుజ్జాయిని నిద్రపుచ్చాలంటున్నారు నిపుణులు. ‘కంగారూ కేర్‌’ పద్ధతి ద్వారా తల్లి నుంచి అందే వెచ్చదనం చిన్నారులకు భద్రతా భావాన్ని అందిస్తుందని చెబుతున్నారు. ఇది వారి గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, శరీరాన్ని వెచ్చగా ఉంచి వ్యాధినిరోధక శక్తినీ పెంచుతుందని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్