వాటితో ఆడనివ్వండి

విజయ్‌కు పక్కింటి కుక్కపిల్ల అంటే ఇష్టం. దాంతో ఆడుకోవాలనుకుంటాడు. సమయం వృథా అని కోప్పడుతుంది తల్లి. కానీ పిల్లలకు చిన్నప్పటి నుంచి వారికి నచ్చిన పెంపుడు జంతువులను సంరక్షించడం నేర్పిస్తే, వారిలో మంచి లక్షణాలు

Published : 19 Apr 2022 01:46 IST

విజయ్‌కు పక్కింటి కుక్కపిల్ల అంటే ఇష్టం. దాంతో ఆడుకోవాలనుకుంటాడు. సమయం వృథా అని కోప్పడుతుంది తల్లి. కానీ పిల్లలకు చిన్నప్పటి నుంచి వారికి నచ్చిన పెంపుడు జంతువులను సంరక్షించడం నేర్పిస్తే, వారిలో మంచి లక్షణాలు పెరుగుతాయంటున్నారు మానసిక నిపుణులు. అంతేకాదు, ఇతరులకు అవసరమైనప్పుడు చేయూతనందించే గుణం అలవడుతుందని చెబుతున్నారు.

చిన్నారుల్లో పెంపుడు జంతువులంటే ఇష్టపడనివారుండరు. వారికి నచ్చినట్లుగా బాల్యం నుంచి వారితోపాటే పెరిగేలా పిల్లల వయసుకు తగినట్లుగా ఏదైనా పెంపుడు జంతువును కానుకగా అందించాలి. దాంతో రోజూ పిల్లలు కలిసి ఆడుకునేలా చూడాలి. దాని బ్దాగోగులను వారికి అప్పగించాలి. ఇవన్నీ వారిలో జంతుప్రేమ పెరిగేలా చేయడంతోపాటు వాటి పట్ల బాధ్యతగా ఉండటమూ నేర్చుకుంటారు. అదే ప్రేమించే గుణం వారిలో పెరిగి పెద్దదై, ఇతరులను ప్రేమిస్తారు. దాంతో కలిసి ఆడుకున్నప్పుడల్లా మానసిక ఉత్సాహాన్ని పొంది ఒత్తిడికి దూరమవుతారు. ఇవన్నీ వారికి ఒక రకమైన వ్యాయామంగా మారతాయి.

జాగ్రత్తలు.. ఎంత వరకు పెంపుడు జంతువుతో కలిసి ఆడుకోవాలనే హద్దులు చిన్నప్పటి నుంచే వారికి నేర్పాలి. మంచం, సోఫాపైకి వాటిని తీసుకోవద్దని ముందే చెప్పాలి. దానివల్ల కలిగే అనారోగ్యాలపై చిన్నారులకు అవగాహన కలిగించాలి. క్రమశిక్షణగా వాటిని పెంచడంలో మెలకువలను నేర్పాలి. వాటికి ప్రత్యేకంగా బెడ్‌, ఫుడ్‌ తీసుకునే ప్రాంతం వంటి సౌకర్యాలను చూపించాలి. అలాగే ఆహారం అందించడంతోపాటు వాటి శుభ్రత విషయంలోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను చిన్నారులకు చెబితే చాలు. తమకిష్టమైన పెట్‌కు స్నానం చేయించడం, వాకింగ్‌కు తీసుకెళ్లడం వంటివన్నీ నేర్పిస్తే, దాన్నుంచి క్రమశిక్షణను నేర్చుకుంటారు. స్కూల్‌ నుంచి వచ్చేసరికి తమ కోసం ఒక పెంపుడు జంతువు ఇంట్లో ఎదురు చూస్తుందనే భావనే వారిలో సంతోషాన్ని నింపుతుంది. హోంవర్క్‌ పూర్తి చేస్తే దాంతో కలిసి ఆడుకోవచ్చంటే చాలు. ఉత్సాహంగా పూర్తిచేయడానికి సిద్ధపడతారు. ఇలా పిల్లల్లో ఎన్నో మంచి లక్షణాల్ని పెంపొందుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్