సున్నితత్వం నేర్పండి!

మగపిల్లలైనా ఆడపిల్లలైనా... వాళ్ల వ్యక్తిత్వ నిర్మాణంలో అలవాట్లూ, ఆలోచనలూ చాలా ముఖ్యం. ‘మొక్కై వంగనిది మానై వంగునా’ అన్నట్లు... చిన్నప్పట్నుంచే పిల్లల్ని మంచి దారిలో పెట్టకపోతే, పెద్దయ్యాక మార్పు తేవడం కష్టం. పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు ఏం చేయాలంటే....

Updated : 10 May 2022 06:22 IST

మగపిల్లలైనా ఆడపిల్లలైనా... వాళ్ల వ్యక్తిత్వ నిర్మాణంలో అలవాట్లూ, ఆలోచనలూ చాలా ముఖ్యం. ‘మొక్కై వంగనిది మానై వంగునా’ అన్నట్లు... చిన్నప్పట్నుంచే పిల్లల్ని మంచి దారిలో పెట్టకపోతే, పెద్దయ్యాక మార్పు తేవడం కష్టం. పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు ఏం చేయాలంటే...

1. ఎవరితోనైనా సున్నితంగా మెలగడం గురించి తెలపండి. మూగజీవాల్నీ ప్రేమించడం నేర్పండి. సృష్టిలో ప్రతి జీవికీ ప్రాముఖ్యత ఉందనీ, దేన్నీ బాధ పెట్టకూడదనీ, దయ చూపాలనీ చెప్పండి. మరీ ముఖ్యంగా అబ్బాయిల సున్నితత్వంతో ఈ ప్రపంచంలో చాలా మార్పు వస్తుంది.

2. నలుపూ తెలుపూ, పొట్టీ పొడుగూ, లావూ సన్నం... శరీరం తీరు ఎలా ఉన్నా అంగీకరించడం నేర్పండి. మంచి ఆహారం తీసుకుని, ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమనీ, ఈ విషయాల్లో వేరెవరితోనో పోల్చుకోవడం సరికాదనీ తెలపాలి.

3. ఆడపిల్లల్ని, మహిళల్ని గౌరవించడం చాలా ముఖ్యమని అబ్బాయిలకి చెప్పండి. ఈ అంశాన్ని ఎంత చిన్న వయసులో నేర్పితే అంత మంచి ఫలితాలు ఉంటాయి.

4. స్వతంత్రంగా ఉండటం నేర్పాలి. ఇష్టమైన ఆటపాటల విషయంలో, స్నేహితుల దగ్గరా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఎలా ఉంటారో, ఎక్కడైనా అలానే ధైర్యంగా ఉండటం ముఖ్యమని చెప్పాలి.

5. ఆడ, మగ తేడా లేకుండా ఎక్కువ శాతం పిల్లల్లో న్యూనతా భావం ఉంటుంది. రంగు, పొడవు, ఆర్థిక స్థోమత... వ్యక్తిత్వంలో వీటికి ప్రాధాన్యం లేదని చెప్పాలి. చదువైనా, మరో పనైనా సవ్యంగా పూర్తి చేయడంలోనే గుర్తింపు, గౌరవం వస్తాయని చెప్పాలి.

6. చదువు, ఆటలు... ఏ విషయంలోనైనా చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని సాధించడం నేర్పండి.

7. స్నేహితులతో సఖ్యంగా ఉండి, అవసరమైనపుడు వారికి సాయపడటానికి వెనకాడొద్దని చెప్పాలి.

  పిల్లల వ్యక్తిత్వ నిర్మాణంలో తల్లిదండ్రుల నడవడిక ప్రధానమన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇంటి వాతావరణాన్ని అనుసరించే వాళ్ల వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్