నైపుణ్యాలని... ఇలా నేర్పండి!

రమ్య పదేళ్ల వయసులోనే కథల పుస్తకం రాసి వార్తల్లోకెక్కింది. ఎనిమిదేళ్ల రాహుల్‌ గీసిన బొమ్మను ప్రశంసించి స్కూల్‌ నోటీస్‌ బోర్డ్‌లో ఉంచారు. చిన్నవయసులోనే ఇలా కొందరు పిల్లలు నచ్చిన రంగంలో రాణిస్తుంటారు. నృత్యం, చిత్రకళ, క్రీడలవైపు పిల్లల్లో బాల్యం నుంచి ఆసక్తిని కలిగిస్తే అవి వారిలో ఎన్నో నైపుణ్యాలు పెంచుతాయంటున్నారు నిపుణులు....

Published : 11 May 2022 01:25 IST

రమ్య పదేళ్ల వయసులోనే కథల పుస్తకం రాసి వార్తల్లోకెక్కింది. ఎనిమిదేళ్ల రాహుల్‌ గీసిన బొమ్మను ప్రశంసించి స్కూల్‌ నోటీస్‌ బోర్డ్‌లో ఉంచారు. చిన్నవయసులోనే ఇలా కొందరు పిల్లలు నచ్చిన రంగంలో రాణిస్తుంటారు. నృత్యం, చిత్రకళ, క్రీడలవైపు పిల్లల్లో బాల్యం నుంచి ఆసక్తిని కలిగిస్తే అవి వారిలో ఎన్నో నైపుణ్యాలు పెంచుతాయంటున్నారు నిపుణులు.

ఆత్మవిశ్వాసం... బొమ్మలు వేసి.. రంగులు నింపమనడం, ఊహించి బొమ్మలు గీసేలా ప్రోత్సహించడం వంటివన్నీ పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచుతాయి. చిన్న చిన్న స్టేజ్‌ డ్రామాల్లో భాగస్వాములను చేస్తే మొదట భయపడ్డా, నెమ్మదిగా బిడియం వదిలించుకుని ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు.

పరిష్కారాన్ని.. క్లేతో బొమ్మలను చేయడం నేర్పించాలి. మనసులో అనుకున్నట్లుగా మలచడానికి కృషి చేసి సాధిస్తారు. ఇది వారి మెదడుకు మంచి శిక్షణ. క్రమంగా రకరకాల డిజైన్లు లేదా బొమ్మలు చేయడం ప్రారంభిస్తారు. సృజనాత్మకతతో కూడిన ఆలోచనలతోపాటు క్రమశిక్షణ వస్తుంది. ఏదైనా సమస్య ఎదురైతే దానికి పరిష్కారమార్గాన్ని వెతకడం కూడా అలవడుతుంది.

ఏకాగ్రత.. నృత్యం లేదా ఏదైనా సంగీతపరికరం వాయించడం వంటివి నేర్పిస్తే వాటి నుంచి ఏకాగ్రత అలవడుతుంది. ఈ కళల్లో మెదడుతో అవయవాలను అనుసంధానం చేయగలగాలి. అప్పుడే దాన్ని నేర్చుకోగలుగుతారు. దీనికి ఏకాగ్రత ఉంటేనే వీలవుతుంది. ఏదైనా కథ చదివి వినిపించిన తర్వాత వారినీ పైకి చదవమని చెప్పాలి. సరదాగా సాగే ఈ పుస్తక పఠనం ద్వారా కొత్త పదాలను తెలుసుకోవడం, పలకడం నేర్చుకుంటారు. పుస్తకాలపై అభిరుచిని పెంచుకోవడంతోపాటు వారి అనుభవాలను మరో కథగా మలచగలిగే సృజనాత్మకతను సంపాదిస్తారు.

సహకారం.. క్రీడల్లో ప్రవేశించేలా చిన్నప్పటి నుంచి ప్రోత్సహించాలి. ఆటలతో గెలుపు, ఓటమికి తేడా తెలుసుకుంటారు. బృంద క్రీడలు అయితే తోటివారికి సహకారాన్ని అందిస్తూ ఆడే విధానాన్ని ఆకళింపు చేసుకుంటారు. ఏదైనా తప్పు జరిగితే దాన్ని ఆమోదించే తత్వాన్ని నేర్చుకుంటారు. వేసే ప్రతి అడుగులోనూ కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఇవన్నీ వారిని భవిష్యత్తులో సరైన నిర్ణయాలు తీసుకోగలిగే నైపుణ్యాలను అందిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్