తమ తప్పు తెలుసుకునేలా..

అమల ఆరేళ్ల కొడుకు చేయొద్దన్న పని చేసి మరీ చూపిస్తాడు. బూట్లు బురదలో ముంచుతాడు. పుస్తకాల మధ్య పేజీలను చించుతాడు. స్నేహితుల పెన్సిళ్లు విరగ్గొడతాడు. కోప్పడితే నేనేం మారాం చేస్తాడు. చిన్నారులు తాము చేసిన పనుల్లో ఏది సరైనది,

Published : 07 Jun 2022 01:03 IST

అమల ఆరేళ్ల కొడుకు చేయొద్దన్న పని చేసి మరీ చూపిస్తాడు. బూట్లు బురదలో ముంచుతాడు. పుస్తకాల మధ్య పేజీలను చించుతాడు. స్నేహితుల పెన్సిళ్లు విరగ్గొడతాడు. కోప్పడితే నేనేం మారాం చేస్తాడు. చిన్నారులు తాము చేసిన పనుల్లో ఏది సరైనది, ఏది కాదు అనే తేడా తెలుసుకునేలా అవగాహన కలిగించాలంటున్నారు నిపుణులు. తమ తప్పులను తాము తెలుసుకునేలా తల్లిదండ్రులే నేర్పించాలంటున్నారు.

త్తు నుంచి దూకితే దెబ్బలు తగులు తాయని ఎన్నిసార్లు చెప్పినా పిల్లలు అదే చేస్తారు. కింద పడితే ప్రమాదం జరుగుతుందనే అవగాహన వారికి ఉండదు. అలా కిందపడినప్పుడు దగ్గరకు తీసుకోవాలి. అయ్యో పడిపోయావు లేదా నేను చెప్పాకదా పడిపోతావని..అని కాకుండా, జరిగిన నష్టాన్ని, దెబ్బలు తగిలాయనే విషయాన్ని మాత్రం వారి మెదడులోకి చేరేలా చేయాలి. దాంతో మరోసారి అలా చేయడానికి ఆలోచిస్తారు. వారి పొరపాటును వాళ్లే తెలుసుకునేలా చేస్తే చాలు. అవగాహన తెచ్చుకుంటారు.

కారణం చెప్పాలి.. హోంవర్క్‌ చేయడంలో వెనుకడుగేస్తూ, తప్పించుకోవడానికి ప్రయత్నించే చిన్నారులపై కోపాన్ని ప్రదర్శించడంతో మార్పు తేవడం కష్టం. అలా తోటివారికన్నా వెనుకబడటంతో మార్కులే కాదు, తరగతిలో మంచి పేరు తెప్పించుకోలేమనే విషయాన్ని తెలియజేయాలి. హోంవర్క్‌ చేయకపోవడమే కారణం కాబట్టి, ఈసారి అలాకాకుండా ఉత్సాహంగా తన పని తానే పూర్తిచేసేలా అలవాటు చేయాలి. తరగతిలో అందరిలాగే ముందు వరుసలో ఉండే అనుభవాన్ని ఆ చిన్నారి పొందిన తర్వాత ఆ తప్పును మరోసారి చేయకుండా ఉంటాడు. చిన్నప్పడు తాము కూడా ఈ పొరపాట్లు చేసి అందులోంచి నేర్చుకున్నామని అమ్మానాన్న చెబితే చాలు. వారిలోనూ మార్పు వస్తుంది.

సానుకూలంగా.. ఆలస్యంగా నిద్ర లేచి స్కూల్‌కు వెళ్లనంటారు. ఆహారాన్ని వృథా చేస్తుంటారు... ఇలాంటప్పుడు వారిపై కోప్పడితే మార్పు రాదు. తాను చేసేది తప్పు అని పిల్లలకు ఆ సమయంలో అనిపించకపోవచ్చు. అటువంటప్పుడే పెద్దవాళ్లు దాన్ని ఓ పెద్ద సమస్యగా చేయకుండా సానుకూలంగా పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఉదయం నిద్ర లేవాలంటే రాత్రి త్వరగా నిద్రపోయేలా అలవాటు చేయడం, ఆకలి వేయడానికి అవుట్‌డోర్‌ గేమ్స్‌ ఆడించడం వంటివి ఆ చిన్నారిలో మార్పు తెస్తాయి. తనలో మార్పు వచ్చిన తర్వాత గతంలో తన పొరపాట్లను విడమర్చి చెప్పగలిగితే భవిష్యత్తులోనూ క్రమశిక్షణకు ప్రాముఖ్యతనివ్వడం, ఆహారానికి విలువ ఇవ్వడం వంటివి పాటిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్