మాట్లాడుతుంటే ఆసక్తి చూపడం లేదా...

కృప కూతురు కాలేజీలో చేరినప్పటి నుంచి ఏం చెప్పినా వినడానికి ఆసక్తి చూపించడం లేదు. తన నిర్లక్ష్యధోరణి చూస్తుంటే కృపకు భయం మొదలైంది. యుక్తవయసువారు పెద్దవాళ్లు ఏం చెప్పాలని చూసినా...

Updated : 16 Jun 2022 04:28 IST

కృప కూతురు కాలేజీలో చేరినప్పటి నుంచి ఏం చెప్పినా వినడానికి ఆసక్తి చూపించడం లేదు. తన నిర్లక్ష్యధోరణి చూస్తుంటే కృపకు భయం మొదలైంది. యుక్తవయసువారు పెద్దవాళ్లు ఏం చెప్పాలని చూసినా అక్కడి నుంచి బయటకెళ్లిపోతుంటారు. ఆ సమయంలో పెద్దవాళ్లు ఎలా వ్యవహరించాలంటే...

కాలేజీకి వెళ్లినప్పటి నుంచి పిల్లల చుట్టుపక్కల వాతావరణం మారుతుంది. వారిపై పెరిగిన సిలబస్‌, చేయాల్సిన ప్రాజెక్టులు, పాఠాల్లో తీరని సందేహాలు, లక్ష్యాలు, కొత్త స్నేహాలువంటి అంశాలకు సంబంధించి ఒత్తిడి మొదలవుతుంది. హైస్కూల్‌ స్థాయిలో ఉండే ఉత్సాహం కొరవడుతుంది. అప్పటివరకు అందరితో సరదాగా ఉండే పిల్లల్లో కొత్త ఆందోళన కనపడుతుంది. పెద్దవాళ్లు దాన్ని గుర్తించాలి. అలాకాకుండా చదువుకు సంబంధించిన సలహాలు, సూచనలు కఠినంగా చెప్పడం, ర్యాంకు గురించి హెచ్చరించడం వంటివన్నీ పిల్లలపై మరింత ఒత్తిడిని తెస్తాయి. ఇవన్నీ వారిని పెద్దవాళ్లకు దూరంగా జరిగేలా చేస్తాయి. ఎక్కడ దగ్గరకొస్తే వారి సలహాలు వినాల్సి వస్తుందోననే భయంతో నిర్లక్ష్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తుంటారు.

అపార్థం చేసుకోకుండా...: యుక్తవయసులో పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు అపార్థం చేసుకోకూడదు. మార్పుకుగల కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ వయసులో మేం ఇలా ప్రవర్తించలేదు అంటూ వారిని విమర్శించకూడదు. అప్పటికీ, ఇప్పటికీ ప్రతి విషయంలోనూ చాలా తేడాలున్నాయని గుర్తించాలి. అలాగే ఇతర పిల్లల గురించి పోల్చకుండా ఉండటం మంచిది. పిల్లల పట్ల మృదువుగా ప్రవర్తిస్తూ, స్నేహితులుగా మారితే చాలు, సమస్యలను చెప్పడానికి వారు సిద్ధంగా ఉంటారు. వాటిని పూర్తిగా విని, వెంటనే పరిష్కారాన్ని చెప్పకుండా వాటన్నింటినీ అధిగమిద్దాం అంటూ భరోసా ఇస్తే చాలు. వారి ఒత్తిడి దూరమై, పూర్వపు ఉత్సాహం కనిపిస్తుంది. 

ఒత్తిడికి దూరంగా..: ఇంట్లో వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచడం ముఖ్యం. సరదాగా అందరూ కలిసి ఏదైనా పర్యటనకు వెళ్లడం, ఇండోర్‌ గేమ్స్‌ ఆడటం, కలిసి మైదానంలో వాకింగ్‌, రన్నింగ్‌ వంటివి చేయడం వంటివన్నీ వారిలో ఒత్తిడిని దూరం చేస్తాయి. దాంతో చదువులోనే కాదు, మిగతా రంగాల్లోనూ వారు అడుగుపెట్టి లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకు అడుగువేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్