నాన్నా పులి... నష్టమేంటి?

అన్నయ్య నా పెన్సిల్‌ విరిచేశాడు, తమ్ముడు నా పుస్తకాన్ని పోగొట్టాడు... ఇటువంటి ఫిర్యాదులు వినిపిస్తూనే ఉంటాయి. ఈ అంశాలు చిన్నవే కావొచ్చు. వాటిలో ఎంత నిజం ఉందో గుర్తించాలంటున్నారు నిపుణులు. పిల్లలు అబద్ధం చెబుతున్నట్లు తెలిస్తే మాత్రం తప్పు అని మొదటి

Updated : 21 Jul 2022 08:49 IST

అన్నయ్య నా పెన్సిల్‌ విరిచేశాడు, తమ్ముడు నా పుస్తకాన్ని పోగొట్టాడు... ఇటువంటి ఫిర్యాదులు వినిపిస్తూనే ఉంటాయి. ఈ అంశాలు చిన్నవే కావొచ్చు. వాటిలో ఎంత నిజం ఉందో గుర్తించాలంటున్నారు నిపుణులు. పిల్లలు అబద్ధం చెబుతున్నట్లు తెలిస్తే మాత్రం తప్పు అని మొదటి నుంచే చెప్పాలంటున్నారు. లేదంటే ఆ అబద్ధాలే అలవాటుగా మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

మ్మ తిడుతుందనో, నాన్న కొడతారనో చిన్నారులు తమను కాపాడుకోవడానికి అబద్ధాలు చెబుతూ ఉంటారు. వాటిని గుర్తించి అది మంచి పద్ధతి కాదని బాల్యం నుంచే అవగాహన కలిగించాలి. చిన్న చిన్న విషయాలైనా, ఆ తర్వాతైనా నాకు నిజం తెలుస్తుంది. జరిగిందేంటో చెప్పమని సున్నితంగా అడగాలి. వారి నుంచి విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేయాలి. అందులో వారి పాత్ర ఎంతో తెలుసుకోవాలి. ఆ ఫిర్యాదుల్లో నిజం లేకపోతే అలా చేయడం మంచిది కాదని వివరించాలి. ఎక్కడ సమస్య ఉందో గుర్తించి పరిష్కరిస్తే చాలు. మళ్లీ అబద్ధం చెప్పడానికి సంకోచిస్తారు.

కథలుగా.. అసత్యం చెబితే నష్టం ఏంటో తెలిసేలా... ‘నాన్నా పులి’ లాంటి చిన్న చిన్న కథలు చెప్పాలి. వాటి సారాంశం వారికి అర్థమైతే చాలు. నిజం దాస్తే జరిగే నష్టం తెలుసుకుంటారు. పెద్దైన తర్వాత వాళ్లే తెలుసుకుంటారులే అని నిర్లక్ష్యం చేస్తే ఆ నష్టం పిల్లల భవిష్యత్తునే ప్రభావితం చేస్తుంది. ఒక అబద్ధం చెబితే, దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మరిన్ని అబద్ధాలాడాల్సి వస్తుందని పిల్లలకు అవగాహన కలిగించాలి. అదే నిజం చెబితే ఎన్ని సార్లు చెప్పినా అది మారదు. ఆ తర్వాత ఇబ్బంది పడాల్సిన అవసరమూ ఉండదని వివరిస్తే చాలు. చిన్నారులు వాటికి దూరంగా ఉంటారు.

తోటివారి నుంచి.. కొందరు పిల్లలు స్కూల్‌ నుంచి తోటి వారి వస్తువులను ఇంటికి తీసుకొస్తారు. వాటి గురించి అడిగినప్పుడు అస్పష్టంగా సమాధానాలు చెబుతారు. వాటిని బట్టే వారు ఏదో దాస్తున్నారని గుర్తించొచ్చు. ఇతరుల వస్తువులు వారి అనుమతి లేకుండా తీసుకురాకూడదని చెప్పడమే కాదు, తిరిగి ఇచ్చేసేలా చూడాలి. ఇలా రెండు మూడు సార్లు చేస్తే ఇక ఆ తరువాత అలా తీసుకురారు. నాలుగైదేళ్ల వరకు చిన్నారులకు ఇది తప్పు, ఒప్పు అనేది స్పష్టత ఉండదు. వారికి బాల్యం నుంచి నేర్పించడం పెద్దవాళ్ల బాధ్యతే.

కోపం వెనుక.. కొందరు చిన్నారులు ఇతరులపై ఉన్న కోపాన్ని తీర్చుకోవడానికి వారి గురించి అబద్ధపు ఫిర్యాదులు చేస్తుంటారు. అలా తృప్తి పడుతుంటారు. అది గుర్తించి వారిలో పరివర్తన వచ్చేలా ప్రయత్నించాలి. ఆ కోపానికి కారణాన్ని తెలుసుకొని పరిష్కరించాలి. లేదంటే పెద్దయ్యేకొద్దీ ఈ లక్షణం, వారి మానసికారోగ్యంపైనా ప్రభావాన్ని చూపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్