అమ్మతనాన్ని ఆస్వాదిస్తూ...!

అమ్మతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి మహిళా ఈ దశను ఆస్వాదించాలనుకుంటుంది. కొత్తగా ఇంట్లోకి వచ్చిన పాపాయి బాధ్యతల్ని సమన్వయం చేసుకునే విషయంలో మాత్రం కాస్తంత ఒత్తిడికి గురవుతుంటారు అమ్మలు.

Published : 16 Oct 2022 00:34 IST

అమ్మతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి మహిళా ఈ దశను ఆస్వాదించాలనుకుంటుంది. కొత్తగా ఇంట్లోకి వచ్చిన పాపాయి బాధ్యతల్ని సమన్వయం చేసుకునే విషయంలో మాత్రం కాస్తంత ఒత్తిడికి గురవుతుంటారు అమ్మలు. అలాంటివారికోసమే ఈ సలహాలు.

1. పాపాయిని ఎత్తుకోవడమూ, బుజ్జగించడమూ ఎలానో ఏ తల్లికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కో చిన్నారి ఒక్కోలా ఉండొచ్చు.... కాబట్టి ఇతరులతో పోల్చొద్దు. మీ బుజ్జాయి అవసరాలు క్రమంగా మీకే అర్థమవుతాయి. దానికోసం పెద్దగా ఆందోళన పడనక్కర్లేదు.

2. మీ ఆత్మీయ స్పర్శ పాపాయిని మానసికంగా దృఢంగా ఉండేలా చేస్తే, పాలు చిన్నారిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ విషయంలో అపోహలకు తావివ్వకండి. మీరు ఒత్తిడిని జయించాలన్నా, తల్లిపాలు శిశువుకి సమృద్ధిగా అందాలన్నా... మీరూ సమతుల పోషకాహారాన్ని తీసుకోవాలి. అప్పుడే ఇద్దరికీ మంచిది.

3. పాపాయి రాకపూర్వం ఇంటి నిర్వహణ మాత్రమే ఉండేది. ఇప్పుడు తనని చూసుకుంటూనే ఆ పనులూ చేసుకోవాలి. ఇది కత్తిమీద సామే. రెండింటినీ సమన్వయం చేసుకోలేకపోతే ఒత్తిడి తప్పదు. ఇలాంటప్పుడు సరైన సమయ ప్రణాళికలు వేసుకుని ఓ క్రమపద్ధతిలో పూర్తి చేస్తేసరి. సులువుగా పనులు పూర్తవుతాయి. ఒత్తిడీ తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్