షరతులతో ఇవ్వండి!

ఇప్పటి తల్లిదండ్రులు... బిడ్డలకు అడిగిందల్లా ఇవ్వడంలోనే మజా ఉందనుకుంటున్నారు. అలా చేస్తేనే వారు సంతోషంగా ఉంటారని భావిస్తున్నారు. దాంతో పిల్లలు తాము కోరుకుంది ఎప్పుడైనా దక్కకపోతే ఏడ్చో, బెదిరించో సాధించుకోవాలన్నట్లుగా మారిపోతున్నారు.

Published : 03 Nov 2022 00:34 IST

ఇప్పటి తల్లిదండ్రులు... బిడ్డలకు అడిగిందల్లా ఇవ్వడంలోనే మజా ఉందనుకుంటున్నారు. అలా చేస్తేనే వారు సంతోషంగా ఉంటారని భావిస్తున్నారు. దాంతో పిల్లలు తాము కోరుకుంది ఎప్పుడైనా దక్కకపోతే ఏడ్చో, బెదిరించో సాధించుకోవాలన్నట్లుగా మారిపోతున్నారు. అయితే, ఈ పద్ధతి వారి భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తుందంటారు నిపుణులు. మరేం చేయాలంటే!

* పిల్లలు తాము కోరింది చేయాల్సిందే అని పట్టు పడుతున్నప్పుడు... మీరు అంగీకరించడం మొదలు పెడితే దాన్నే అలుసుగా తీసుకునే ప్రమాదం ఉంది. అంతేకాదు, భవిష్యత్తులో ఎప్పుడైనా వారికి ఓటమి ఎదురైతే తట్టుకోలేరు. అందుకే కొన్ని విషయాల్లో నో చెప్పడానికి మొహమాట పడొద్దు.

* ఏ కారణంతో అయినా పిల్లలు అడిగింది ఇవ్వాలని పేచీ పెడితే వెంటనే తలొగ్గకండి. ఒకవేళ మీరు అంగీకరించాల్సి వచ్చినా... దానికి షరతులు విధించండి. దాన్ని సాధించాలంటే... వారికి కొన్ని లక్ష్యాలను నిర్దేశించండి. వాటిని పూర్తి చేస్తేనే కోరుకున్నవి దక్కుతాయనే విషయం చెప్పండి. అప్పుడే ఏదైనా కావాలంటే కష్టపడాలన్న విషయం అర్థమవుతుంది.

* బిడ్డలకు కష్టం కలగకుండా పెంచాలనుకోవడం మంచిదే. కానీ, కష్టం విలువ తెలియక పోతే, సర్దుబాట్లు అర్థం కాకపోతే ఒక్కోసారి జీవితాన్నే కోల్పోవలసి వస్తుంది. అందుకే ఎప్పుడు ఎలా ఉండాలో? ఎక్కడ తగ్గాలో నెగ్గాలో అర్థమయ్యేలా చెప్పాలి. వాస్తవ జీవితానికి దగ్గరగా వారిని బతకనివ్వాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్