సర్దుకుపోతే సంతోషమే...

పెళ్లితో ఒక్కటైన జీవితం నూరేళ్లూ హాయిగా సాగిపోవాలంటే ముందు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. అలా ఉండాలంటే...

Updated : 12 Nov 2022 04:38 IST

పెళ్లితో ఒక్కటైన జీవితం నూరేళ్లూ హాయిగా సాగిపోవాలంటే ముందు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. అలా ఉండాలంటే...

నమ్మండి...: వైవాహిక జీవితానికి నమ్మకమే పునాది. మీ భాగస్వామి విషయంలో బోలెడు సందేహాలు, అపోహలు ఉండి ఉండొచ్చు. చిన్న చిన్న విషయాల్లోనూ అభద్రత కలిగి ఉండొచ్చు. అయినంత మాత్రాన అవతలి వారిపై మీరు నమ్మకాన్ని కోల్పోనక్కర్లేదు. కొన్నిసార్లు మీరు కోరినట్లు జరగకపోవడానికీ, మీకు తెలియకపోవడానికీ కూడా కారణాలుండొచ్చు. ముందు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే మీ అనుబంధం ఆనందంగా సాగిపోతుంది.
ప్రేమించండి: పెళ్లయ్యి కొన్నాళ్లు గడిచాక ఒకరిపై ఒకరు ప్రేమను కురిపించుకోవడం తగ్గిపోతుంది. దాంతో జీవితమూ నిస్సారంగా మారుతుంది. అది క్రమంగా మీ మీద మీకే ఆసక్తిని తగ్గిస్తుంది. అలా కాకూడదంటే... మీ ప్రేమను తెలిపేలా చిన్న చిన్న సర్‌ప్రైజ్‌లు ఇవ్వండి. నలుగురూ ఉన్నప్పుడు మీ భాగస్వామిలోని సానుకూల అంశాలు ప్రస్తావించండి. కాస్త సమయం కేటాయించి పాత కబుర్లు చెప్పుకోండి. ఇలా మీరు అవతలివారికి కేటాయించే సమయం అభద్రతను తగ్గించి ప్రేమను పంచుతుంది. మీ బంధాన్ని బలంగా మారుస్తుంది.

సరిదిద్దుకోండి: పొరపాట్లనేవి అందరమూ చేస్తాం. అయితే వాటిని గుర్తించినా ఒప్పుకోవడానికి మాత్రం వెనకాడతాం. సరిదిద్దుకోవడానికీ అస్సలు ఇష్టపడం. కానీ భార్యాభర్తల అనుబంధంలో ఈ పద్ధతి మంచిది కాదు. కలకాలం కలిసి ఉండాల్సిన కాపురంలో చిచ్చుకి కారణమవుతుంది. అందుకే వాదనలూ, గొడవల్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడం, తప్పొప్పులను గమనించి పరిణతితో ఆలోచించి అవసరమైన విషయాల్లో సర్దుబాటు చేసుకోవడం మంచిది. అప్పుడే జీవితం సంతోషంగా సాగిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్