మరింత దగ్గరగా...

పెళ్లైంది, ఏదోలా కలిసి ఉండాలని అనుకుంటూ గడపడం కన్నా.. ఒకరికొకరు మానసిక బంధాన్ని పెనవేసుకోగలిగితేనే ఆ దాంపత్యం సంతోషంగా సాగుతుందంటున్నారు నిపుణులు. దీనికి పాటించాల్సిన నియమాలు కూడా చెబుతున్నారు.

Published : 15 Nov 2022 00:47 IST

పెళ్లైంది, ఏదోలా కలిసి ఉండాలని అనుకుంటూ గడపడం కన్నా.. ఒకరికొకరు మానసిక బంధాన్ని పెనవేసుకోగలిగితేనే ఆ దాంపత్యం సంతోషంగా సాగుతుందంటున్నారు నిపుణులు. దీనికి పాటించాల్సిన నియమాలు కూడా చెబుతున్నారు.

పారదర్శకత.. దంపతుల మధ్య నిజాయతీ, పారదర్శకత ఉండాలి. భాగస్వామిలో ఇలాంటి లక్షణాలు ఎదుటి వారిని ఆకర్షిస్తాయి. తెరిచిన పుస్తకంలా ఉండే అవతలి వారిపై పూర్తి అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. వారి మనసేంటో అర్థం చేసుకొని మరీ నడుస్తారు. ఒకరు తామెలా ఉండాలనుకుంటున్నారో.. అలాగే నచ్చినట్టు ఉండేలా ఎదుటి వారినీ ప్రోత్సహించాలనే ఆలోచన కలుగుతుంది. ఇవి ఒకరిపై మరొకరికి విలువ, గౌరవాన్ని పెంచుతాయి. తమకంటూ స్పేస్‌ ఇచ్చిన భాగస్వామికి కూడా అలాంటి అవకాశాన్ని అందించాలనుకుంటారు. ఇలా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడంతో ఇరువురి మధ్య అనుబంధం పెరుగుతుంది.

సమానత్వం..  దాంపత్యంలో ఒకరి అభిరుచి మరొకరికి తెలిసి ఉండాలి. వాటికి తమ వంతు చేయూతను అందించడానికి ఇరువురూ నిత్యం సిద్ధంగా ఉండాలి. ఎదుటివారిలోని ప్రత్యేకతను గుర్తించాలి. దానికి ప్రాధాన్యతనివ్వాలి. సందర్భానుసారం అభినందిస్తూ ఉండాలి. అలాకాకుండా.. వారిని పొగడటానికి అహం అడ్డొచ్చి, తామెక్కడ భాగస్వామి ఎదుట తక్కువ అవుతామోనని భావిస్తే మాత్రం భార్యా భర్తలు ఎప్పటికీ మానసికంగా దగ్గర కాలేరు. దంపతుల మధ్య తక్కువ, ఎక్కువ తేడా లేకుండా ఇద్దరూ సమానమే అనే భావం విడదీయలేని బంధం ఏర్పడేలా చేస్తుంది. 

నమ్మకం.. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం వంటి అంశాలున్న భాగస్వామిని ఎదుటి వారు మరింత ప్రేమిస్తారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సానుకూలంగా ఆలోచించి పరిష్కారమార్గాన్ని సూచించే లక్షణం భార్య లేదా భర్తలో ఉంటే వారు అవతలి వారి నుంచి మరింత గౌరవాన్ని పొందుతారు. నేనున్నాననే భరోసా కలిగిస్తూ, తెలివిగా సమస్యను తీర్చగలగడం ఇరువురి మధ్య దూరం లేకుండా చేస్తుంది. తమకు సరైన భాగస్వామి దొరికారనే నమ్మకం ఎదుటి వారికి కలిగించగలిగితే చాలు... ఆ బంధం పదికాలాలు పచ్చగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్