మీరు పాటిస్తేనే!

విలువలు కావొచ్చు, పద్ధతులు అయ్యి ఉండొచ్చు... పిల్లలు అన్నీ చక్కగా నేర్చేసుకోవాలని తల్లిదండ్రులుగా మనం భావిస్తాం.

Published : 17 Nov 2022 00:47 IST

విలువలు కావొచ్చు, పద్ధతులు అయ్యి ఉండొచ్చు... పిల్లలు అన్నీ చక్కగా నేర్చేసుకోవాలని తల్లిదండ్రులుగా మనం భావిస్తాం. అవి వాళ్లకు అలవాటు కావాలంటే ముందు మనం పాటించాలి. అప్పుడే చిన్నారులూ వాటిని అనుసరిస్తారు.

* మా పాప అది తినదు... ఇది తినదు అంటూ ఫిర్యాదులు చేస్తుంటారు కొందరు తల్లులు. అసలు మీ ఇంటిల్లిపాది ఆహారపు టలవాట్లు ఎలా ఉన్నాయో గమనించారా? ముందు దాన్ని సరిదిద్దండి. తర్వాత కంటికింపుగా, రుచికరంగా, చక్కటి వాసనలతో ఉండేలా వండిపెడితే... ఎంచక్కా లాగిస్తారు. ఈ మూడు లక్షణాలో కనీసం ఒకటైనా ఉండేలా చూసుకుంటే మీరేమాత్రం వెంటపడక్కర్లేదు... కావలసింది వాళ్లే తింటారు.

* పిల్లలు మాట్లాడే తీరు బాలేదా. ముందు మనమెలా మాట్లాడుతున్నామో గమనించుకోవాలి. ఇంట్లోని పెద్దల పట్ల మనం చూపించే ప్రేమ, అభిమానాలు... ఇతరులతో మాట్లాడే పద్ధతి అన్నీ వారిపై ప్రభావం చూపిస్తాయి. అందుకే ఎప్పుడైనా వారు ఏది పడితే అది మాట్లాడుతుంటే గొప్పగా, మురిసిపోకండి. అప్పుడే దాన్ని ఖండించండి.

* చిన్నారులు పుస్తక పఠనం అంటే వారు తరగతిలో చదివే పాఠాలతో లెక్కేస్తారు. విసుగ్గా భావిస్తారు. అలా కాక వారు ఇతర పుస్తకాలనూ ఇష్టంగా చదవాలంటే మీరూ టీవీలూ, ఫోన్లకు దూరంగా ఉండాలి. వారికి పఠన మాధుర్యాన్ని తెలియజేయడానికి ఆ విశేషాలను ఆసక్తికరంగా పంచుకోవాలి. వాటిపై ఉత్సుకతను పెంచాలి. అలానే కొత్త అభిరుచులను నేర్పించాలి.

* మన శరీరంపై మనకి నియంత్రణ ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ విషయంలో పిల్లలూ మినహాయింపు కాదు. వారికి మంచి ఆహారపుటలవాట్లతో పాటు వ్యాయామం కూడా అవసరమే. రోజూ కొంత సమయం వారితో కలిసి వ్యాయామం చేయండి. ఆటలు ఆడండి. ఇవి వారికే కాదు... మీకూ మంచిదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్