మీలానే ఉండాలనుకోవద్దు

సంసారమన్నాక సమస్యలు లేకుండా ఎందుకు ఉంటాయి. కానీ గొడవొస్తే అది సద్దుమణగడానికి ఇరువురూ కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలంటున్నారు మానసిక నిపుణలు.

Published : 27 Nov 2022 00:06 IST

అనుబంధం

సంసారమన్నాక సమస్యలు లేకుండా ఎందుకు ఉంటాయి. కానీ గొడవొస్తే అది సద్దుమణగడానికి ఇరువురూ కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలంటున్నారు మానసిక నిపుణలు.

* అలవాట్లూ, అభిరుచులే కాదు... మాట్లాడే తీరూ ఒక్కొక్కరిదీ ఒక్కోలా ఉంటుంది. ఒకరు తియ్యగా మాట్లాడతారు. కొందరు నేరుగా చెప్పేస్తారు. మీరు ఆశించినట్టుగా ఎదుటి వారు లేనప్పుడు... వారి తత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీదే.

* మాటతేడాలూ, ఇష్టాయిష్టాలూ, ఆర్థికాంశాలూ ఇలా ఎన్నో విషయాలమీద చర్చలు జరుగుతూ ఉండొచ్చు. ఒక్కోసారి కాస్త గట్టిగానే వాదించుకుంటాం. అలా అని ప్రతిదీ గొడవే అనుకోవద్దు. మీ అభిప్రాయాన్ని సూటిగా చెప్పడం ఎంత ముఖ్యమో... మీ భాగస్వామి మాట వినడం కూడా అంతే అవసరం. 

* చిన్న గొడవ మొదలైతే.... దానికి పాత విషయాలను చేర్చద్దు. ఎప్పటిదప్పుడే అనే సూత్రాన్ని పాటించండి. జీవిత కాలంలో మరెన్నో చూడాలి కూడా. క్రమంగా ఒకరికొకరు అర్థమై... ఒకటిగా సాగిపోయే రోజు వరకూ దీన్ని కొనసాగించండి.

* సమస్య ఎవరి వల్ల వచ్చినా ముందు మీరే చొరవ తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేయండి. అప్పుడే అహాన్ని తొలగించేయొచ్చు. పొరపాటున తప్పు మీ వల్లే జరిగితే ఒప్పుకోవడానికి సంకోచించకండి. ఒకవేళ మీ భాగస్వామే చేస్తే... మారేందుకు అవకాశం ఇచ్చి చూడండి. కచ్చితంగా సంతోషంగా సాగిపోతారు.

* గొడవకి కారణం ఏదైనా ఎవరి వాదనలు వారికి ఉంటాయి. కొన్ని సార్లు తప్పు జరగకపోయినా ఆవేశం, అహం ఇద్దరి మధ్య దూరాన్ని పెంచేస్తాయి. ఆ పరిస్థితిని రానివ్వొద్దు. వీలైనంత మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. కాస్త సమయం తీసుకుని పరిస్థితుల్ని అంచనా వేయండి. మీ బాధను వ్యక్తీకరిస్తూనే... ఎదుటి వారి స్థానంలో మీరుంటే ఎలా ఉండే వారో ఊహించుకోండి. అప్పుడు ఎంత పెద్ద గొడవ అయినా సులువుగానే పరిష్కారం అవుతుంది. ఈ సమయంలో మూడో వ్యక్తి దగ్గర మాట్లాడటం అసలే చేయొద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్