బయటపడితేనే భవిష్యత్తు...

ప్రేమలో పడటం సహజమే. అయితే, ఆ అనుబంధాన్ని శాశ్వతంగా నిలుపుకోలేనప్పుడు... ఆ ఆలోచనల నుంచి బయటపడటం మాత్రం అంత సులువేం కాదు. కానీ, ఆ స్థితిని అధిగమించలేకపోతే విలువైన జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుందంటారు మానసిక నిపుణులు.

Published : 28 Nov 2022 00:05 IST

ప్రేమలో పడటం సహజమే. అయితే, ఆ అనుబంధాన్ని శాశ్వతంగా నిలుపుకోలేనప్పుడు... ఆ ఆలోచనల నుంచి బయటపడటం మాత్రం అంత సులువేం కాదు. కానీ, ఆ స్థితిని అధిగమించలేకపోతే విలువైన జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుందంటారు మానసిక నిపుణులు.

* వాస్తవాలను గుర్తించాలి... మీ ప్రేమ ఎందుకు విఫలం అయ్యిందో కారణాలు వెతక్కండి. వాటిని తవ్వేకొద్దీ మీకు బాధే మిగులుతుంది. ఏ పరిస్థితులు మీ బంధాన్ని విచ్ఛిన్నం చేసినా సరే... సర్ది చెప్పుకోవడానికీ ప్రయత్నించొద్దు. మిమ్మల్ని మీరు భ్రమల్లోకి తోసుకుంటూ...మరింతగా కుంగిపోవద్దు. ముందు మీ శ్రేయోభిలాషుల మాట వినడానికి ప్రయత్నించండి. ప్రేమ జీవితంలో ఓ భాగమే తప్ప ప్రేమే జీవితం కాదనే వాస్తవాన్ని గ్రహించండి.

* విరామం లేకుండా... ప్రేమను కోల్పోయినంత మాత్రాన మిమ్మల్ని మీరు కోల్పోవాలా?ముందు భావోద్వేగాలను అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. నాకే ఎందుకిలా అనుకోవద్దు. మనకంటే ఎక్కువ కష్టాలు పడుతున్నవారెందరో మన చుట్టూనే ఉంటారు. వారిని చూస్తే మీ సమస్య ఎంత చిన్నదో అర్థమవుతుంది. ఈ సమయంలో వీలైనంత ఎక్కువగా పని కల్పించుకోండి. మీకోసం మీరు సమయం కేటాయించుకోండి. మీకు నచ్చినట్లు ఉండండి.  దూర ప్రయాణాలకూ, విహార యాత్రలకూ వెళ్లండి. కచ్చితంగా బయటపడగలరు.

* మనసారా  ఏడ్వండి... నిజానికి ఆ బాధ నుంచి బయటపడటం మాటల్లో చెప్పినంత తేలికేం కాదు. కష్టం మీది....దానికి పరిష్కారమూ మీరే వెతుక్కోవాలి. ఏం జరిగిందో? ఎలా జరిగిందో మీ మనసుకి తెలుసు...ఇలాంటప్పుడు వచ్చే కన్నీటిని దిగమింగుకునే ప్రయత్నం చేయొద్దు. తనివితీరా ఏడ్చేయండి. మీ గుండె భారం దిగిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్