అన్యోన్యతకు సూత్రాలివీ

పెళ్లంటే... ప్రేమ, నమ్మకం, పరస్పర అవగాహన... అంతకు మించి సర్దుబాట్లు. దాన్ని అర్థం చేసుకుంటే... ఆ అనుబంధం అందరికీ ఆదర్శప్రాయమే.

Published : 28 Nov 2022 00:05 IST

పెళ్లంటే... ప్రేమ, నమ్మకం, పరస్పర అవగాహన... అంతకు మించి సర్దుబాట్లు. దాన్ని అర్థం చేసుకుంటే... ఆ అనుబంధం అందరికీ ఆదర్శప్రాయమే.

* భాగస్వామి అలా ఉండాలి... ఇలా చూసుకోవాలి.. అని పెళ్లికి ముందు ఆలోచిస్తాం. ఆ తరవాత అవతలివారిలో ఏ చిన్న సమస్య ఉన్నా సర్దుకుపోలేక గొడవపడటం మొదలుపెడతాం. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే.. ముందు అవతలివారిని అర్థంచేసుకునేందుకు ప్రయత్నించాలి. లోపాలను గుర్తించాలి. అవి మీకు ఇబ్బంది లేనంతవరకూ చూసీచూడనట్లు వదిలేయడం మంచిది.

* పెళ్లికి ముందు ఎలా ఉండేవారో పెళ్లి అయిన తర్వాత కూడా అలాగే ఉండండి. ఎదుటి వారి మెప్పుకోసం బలవంతంగా మారడం మొదలుపెడితే...అది అసంతృప్తిగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మీ ఆలోచనలు, ఆసక్తులు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరి అభిప్రాయాలూ వేరైనప్పటికీ...ఒక విషయంపై ఏకాభిప్రాయానికి రావొచ్చు. అందుకు కాస్త విశాల దృక్పథం ఇద్దరూ అలవరుచుకోవాలి. అభద్రతను దగ్గరికి రానీయకూడదు.

* లోపాలు లేని వ్యక్తులు ఉండరు. మీరు అనుకున్న లక్షణాలన్నీ ఉండే వ్యక్తి మీకు దొరకకపోవచ్చు. ఒక్కటయ్యాక వాటిని వెతకొద్దు. ప్రతి లోపాన్నీ భూతద్దంలో చూడొద్దు. ఒకవేళ మీ భాగస్వామి వల్ల ఏదైనా పొరపాటు అయితే అతడి స్నేహితులు, కుటుంబ సభ్యుల ముందు విమర్శించకండి. ఒంటరిగా ఉన్నప్పుడు తను చేసిన తప్పును నెమ్మదిగా చెప్పండి. అందర్లో ఉన్నప్పుడు అవతలివారి బలాలనూ, మీకు నచ్చే విషయాలనూ ప్రశంసించండి. క్రమంగా వారూ మీ బాధ అర్థం చేసుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్