స్వేచ్ఛగా ఆలోచించనివ్వండి...

పెద్దల్లోనే కాదు... పిల్లల్లోనూ బోలెడన్ని భావోద్వేగాలు గూడుకట్టుకుని ఉంటాయి. ప్రేమ కావొచ్చు... ఉక్రోషం అయ్యి ఉండొచ్చు. దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయినా, సరిగా వ్యక్తం చేయలేకపోయినా... అది భవిష్యత్తులో ప్రవర్తనా లోపంగా మారొచ్చు. అందుకే వారి భావోద్వేగాలను సరైన దారిలోకి మళ్లించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

Updated : 03 Dec 2022 04:54 IST

పెద్దల్లోనే కాదు... పిల్లల్లోనూ బోలెడన్ని భావోద్వేగాలు గూడుకట్టుకుని ఉంటాయి. ప్రేమ కావొచ్చు... ఉక్రోషం అయ్యి ఉండొచ్చు. దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయినా, సరిగా వ్యక్తం చేయలేకపోయినా... అది భవిష్యత్తులో ప్రవర్తనా లోపంగా మారొచ్చు. అందుకే వారి భావోద్వేగాలను సరైన దారిలోకి మళ్లించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.

* నియంత్రించొద్దు...  పిల్లల్లోని కోపం, ఆవేశం, అక్కసూ, అసూయ, భయం వంటి వాటిని చూపించి వారిని నియంత్రించాలనుకోవడం పొరపాటు. వాటిని స్వేచ్ఛగా వ్యక్తీకరించే అవకాశం ఇవ్వాలి. ఎప్పుడైనా వారి ఆలోచనలూ, ఉద్వేగాలూ పక్కదారి పడుతుంటే అప్పుడు మాత్రం వాటిని ఎలా మార్చుకుంటే మంచిదో సూచించాలి. ఉదాహరణకు... ఏ విషయం మీదైనా కోపం వస్తే... అలాంటి పొరపాటు తనవైపునుంచి జరగకూడదనే పట్టుదల కావాలి. ఆవేశాన్ని శ్రమగా మార్చుకునే శక్తినివ్వాలి. అప్పుడే అవి వారికి మేలు చేస్తాయి.

* ఓర్పుని అలవాటు చేయండి... పిల్లలు ఉద్వేగాలు చూపించే తీరు వారు పెరిగే వాతావరణం మీద ఆధారపడి ఉంటుందంటారు నిపుణులు. ప్రేమ, జాలి, కోపం వంటి వన్నీ... సహజంగా వచ్చేవే. మన భావాల్ని, సూటిగా, స్పష్టంగా చెప్పగలగడమే కాదు.. ఎదుటి వారి బాధల్ని వినే ఓర్పునీ అలవాటు చేయాలి. అప్పుడే ఏ సమయంలో ఎలా స్పందించాలో చిన్నారికి అర్థమవుతుంది.

* బాధ్యత నేర్పండి... కొందరు ప్రతి చిన్న విషయాన్నీ అతిగా ఊహించుకుని ఆలోచిస్తుంటారు. దీనివల్ల తెలియకుండానే ఒత్తిడికి గురవుతుంటారు. సమస్యల్ని చూసి భయపడటమో, కోపం, ఆవేశం తెచ్చుకోవడమో కాక... పరిష్కారాన్ని ఆలోచించే విచక్షణ చిన్నారులకు నేర్పాలి. అందుకు కుటుంబ చర్చల్లో వారికీ స్థానం కల్పించండి. వారి ఆలోచనలు వినండి... సలహాలూ తీసుకోండి. ఇవన్నీ బాధ్యతను నేర్పుతాయి. ఉద్వేగాలను నియంత్రించుకునే లక్షణాన్ని అలవరుస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్