అమ్మలూ... ఆధారపడనివ్వొద్దు!

ఒకప్పటి తల్లిదండ్రులు పిల్లలు శ్రమ విలువ తెలుసుకుని భవిష్యత్తును నిర్మించుకోవాలని కోరుకునేవారు. కానీ ఇప్పటితరం అమ్మానాన్నలు... తాము పడిన కష్టం పిల్లలు పడకూడదనుకుంటున్నారు.

Published : 08 Dec 2022 00:15 IST

ఒకప్పటి తల్లిదండ్రులు పిల్లలు శ్రమ విలువ తెలుసుకుని భవిష్యత్తును నిర్మించుకోవాలని కోరుకునేవారు. కానీ ఇప్పటితరం అమ్మానాన్నలు... తాము పడిన కష్టం పిల్లలు పడకూడదనుకుంటున్నారు. కానీ అడగకుండానే అన్నీ అరచేతిలో పెట్టడం వల్ల చిన్నారులు లోకజ్ఞానం తెలుసుకోలేరు. ప్రతి నిర్ణయంలోనూ ఇతరులపై ఆధారపడే పరిస్థితిని తెచ్చుకుంటారు.

* పెద్దలు ఎప్పుడూ చిన్నారుల భవిష్యత్తు బాగుండాలని కోరుకోవాలి. అంటే... బ్యాంకు బ్యాలెన్సులు, ఆస్తులూ ఇవ్వడమే కాదు... వాటిని కలకాలం నిలబెట్టుకోగలిగే స్థైర్యాన్నీ నింపాలి. కష్టనష్టాలకు వెరవకుండా దీటుగా నిలబడగలిగే వ్యక్తిత్వాన్ని నిర్మించుకోగలిగేలా చేయాలి. ముఖ్యంగా ఉద్వేగాలను నియంత్రించుకునే శక్తినివ్వాలి. ఇవే వారికి... ప్రతికూల పరిస్థితులను సైతం తట్టుకునే తత్వాన్ని అలవాటు చేస్తాయి.

* పిల్లల ఇష్టాలను గుర్తించడం మంచిదే. అలాగని వారు కోరిందల్లా సులువుగా తెచ్చి ఇస్తోంటే... శ్రమించే అలవాటు తగ్గుతుంది. తమకు నచ్చింది ఏదైనా సులువుగా అందుకునే మార్గాల్ని వెతుకుతారు. అది వారి జీవన శైలినీ, జీవితాన్నీ కూడా ప్రతికూలంగా ప్రభావితం చేయొచ్చు. అందుకే అవసరానికి మించి పిల్లలు ఏది కోరుకున్నా... చిన్న లక్ష్యాలు ఇచ్చి వాటిని పూర్తిచేస్తేనే ఇస్తామని కచ్చితంగా చెప్పండి. వాటిని చేరుకుంటేనే ఇవ్వండి. అప్పుడే వారు తమకు కావలసిన దానికోసం కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకుంటారు.

* పెద్దల అలవాట్లు, ఆలోచనలే పిల్లలపైనా ప్రభావం చూపిస్తాయి. అందుకే మీరు ముందు క్రమశిక్షణను, నీతి నిజాయతీలను అలవరుచుకోండి. ఆడంబరంగా మాట్లాడటం, ఎదుటివారిని కించపరచడం వంటివేవీ చేయొద్దు. మీ బిడ్డలు అలా చేస్తుంటే... మొదట్లోనే ఆ తీరుకి అడ్డుకట్ట వేయండి. అప్పుడే వారికి నిరాడంబరత్వం అలవడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్